Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) ప్రజలకు శుభవార్త. త్వరలోనే జిల్లాలో నాలుగు వరసల జాతీయ రహదారి పనులు ప్రారంభం కానున్నాయి.... ములుగు జిల్లా మీదుగా నూట అరవై మూడు జాతీయ రహదారి భూపాలపట్నం వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ జాతీయ రహదారిని అధికారులు త్వరలోనే విస్తరించనున్నారు. ప్రస్తుతం రెండు వరుసల జాతీయ రహదారి వాహనదారులకు అందుబాటులో ఉండగా రాబోయే రోజుల్లో నాలుగు వరసల జాతీయ రహదారిని విస్తరణ పనులు ప్రారంభం కానునట్లు ములుగు జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. నిర్మాణ పనుల నేపథ్యంలోనే సంబంధిత కాంట్రాక్టర్ ప్యాచ్ వర్క్స్ ను సైతం పూర్తి చేస్తున్నారునాలుగు వరుసల జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు...?
ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలోని గట్టమ్మ దేవాలయం నుండి మహమ్మద్ గౌస్ పల్లె వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. పసర ఏటూర్ నాగారం మధ్యలో జాతీయ పరిస్థితి ఏమిటి...ములుగు జిల్లాలోని పసర గ్రామం నుంచి ఏటూర్ నాగారం మధ్యలో జాతీయ రహదారి తరచూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ నేపథ్యంలోనే త్వరలోనే వీటికి శాశ్వత పరిష్కార పనులు ప్రారంభమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
జిల్లాలోని ఏటూరు నాగారం, బ్రాహ్మణపల్లి, జగన్నాధపురం, ఎదిర, ప్రాంతాలలో జాతీయ రహదారి దెబ్బతిన్నదని దాని మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వానాకాలం సీజన్లో అత్యధికంగా 220 మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పసర తాడ్వాయి మధ్యలో 130 మీటర్ల జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిందని జలగలంచ బ్రిడ్జి, కొండపర్తి వద్ద శాశ్వత ప్రాతిపదికన సీసీ తో నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. పసర - మేడారం, తాడ్వాయి - మేడారం రోడ్లలో కూడా మరమ్మత్తు పనులను చేపడతామని అధికారులు చెప్తున్నారు.
కటాక్ష పూర్ చెరువు వంతెన నిర్మాణానికి మోక్షం...జాతీయ రహదారి 163 పక్కనే కటాక్షపూర్ చెరువు ఉంటుంది. భారీ వర్షాలు కురిస్తే ఈ చెరువుకు సంబంధించిన వరద నీరు జాతీయ రహదారి గుండా ప్రవహిస్తుంది దీంతో జాతీయ రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ఎట్టకేలకు త్వరలోనే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ చెరువు సమీపంలోని జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి దీంతో వాహనదారులకు అనేక ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతుండేవి బ్రిడ్జి నిర్మాణంతో వాహనదారుల కష్టాలు తీరనున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana