Venu, News18, Mulugu
ప్రతి విద్యార్థి దశలో పదవ తరగతి ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య విద్యార్థులకు సూచనలు సలహాలు చేశారు. కాబట్టి పదవ తరగతి పరీక్షలకు (TS 10th Exams) హాజరయ్యే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిపెట్టి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని చెప్తున్నారు. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ములుగు జిల్లా (Mulugu District) లోనిప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి మొత్తం 3170 మంది విద్యార్థిని,విద్యార్థులు హాజరుకానున్నారు.ఇందులో 1505 మందిబాలికలు, 1665 మంది బాలురు హాజరుకానున్నారు. ఇందులో జిల్లా పరిషత్ విద్యార్థులు 864, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 26 మంది, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 596 మంది, కస్తూరిబా గాంధీ పాఠశాలల విద్యార్థినిలు 232 మంది, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ విద్యార్థులు 287 మంది, అన్ని రకాల గురుకులాల నుండి 677 మంది, ప్రైవేటు పాఠశాలల నుండి 488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
విద్యార్ధులకు కలెక్టర్ సూచనలు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లాను అగ్ర గ్రామిలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలంటే భయం అనే విషయం మరచి, శ్రద్ధగా, పట్టుదలతో చదివితే ఎటువంటి కష్టం లేకుండా మెరుగైన ఫలితం వస్తుందని చెప్పారు. కష్టపడితే బాగుండేదనే ఆలోచన రావద్దని, ఇప్పుడు కష్టపడితే ఆ ఆలోచన రాదని, కష్టంగా కాకుండా మనస్ఫూర్తిగా ఇష్టంగా చదివి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఉన్నతమైన భవిష్యత్తుకు విద్యార్థి దశలో పదవ తరగతి పరీక్షలు ఏంతో కీలకమని.. అందుకు పట్టుదలతో చదవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణఆదిత్య విద్యార్థులకు సూచిస్తున్నారు. జీవిత లక్ష్యం విషయంలో ఇకపై వచ్చే 10 సంవత్సరాలు నిర్ణయిస్తాయని, ఈ కాలంలో పట్టుదలతో, కష్టపడి చదవాలని, గ్రాండ్ టెస్ట్ లు, స్టడీ ఆవర్స్, కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సలహా ఇచ్చారు.
ఉపాధ్యాయులు కృషి చేయాలి..
పదవ తరగతి పాఠశాల సెంటర్లో అన్ని రకాల వసతులు, పరీక్ష ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులు తీసుకునే ఆహారంకూరగాయలను ఎప్పటికప్పుడు కడిగి వండాలని, వంట సామాగ్రి నాణ్యతగా ఉండే విధంగా ఎంపిక చేసుకొని నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదవగలరని, పర్యవేక్షణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుకృషి చేయాలన్నారు.
పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ మాటల్లో..
జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు నిరాటంకంగా నిర్వహించుటకుగాను 21 పరీక్షా కేంద్రాలను, 21 మంది చీఫ్ సూపర్డెంట్లు, 21 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఒక అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటుతోపాటు ప్రశ్నాపత్రాలనుపోలీస్ స్టేషన్లలో భద్రపరచుటకు గాను రెండు రూట్ ఆఫీసర్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరా ఏర్పాటు, ఇప్పటికే పరీక్షల ఏర్పాట్ల నిమిత్తం జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నామన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ విభాగం వారు కౌంటర్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని..పరీక్షా కేంద్రాలు ఉన్నటువంటి రూట్ లలో వీలైనన్ని ఎక్కువ బస్సులు పరీక్షల సమయంలో నడపవలసిందిగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించామన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ ఆటంకం లేకుండా సంబంధిత డిపార్ట్మెంట్ వారు తగు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు చల్లటి మంచినీరు కోసం కుండలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. గాలి వెలుతురు సరిగా ఉండేట్లుగా, బెంచీలు సరిపడా ఏర్పాటు చేయవలసిందిగా సంబంధితచీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు,సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana, Telangana 10th