హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో కొరియర్

Mulugu: మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో కొరియర్

విచారణ చేపట్టిన పోలీసులు

విచారణ చేపట్టిన పోలీసులు

Telangana: మావోయిస్టు పార్టీ కొరియర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  మావోయిస్టు నకిలీ లేఖలు కలకలం సృష్టిస్తూ కాంట్రాక్టర్లను రాజకీయ నాయకులను బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

మావోయిస్టు పార్టీ కొరియర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  మావోయిస్టు నకిలీ లేఖలు కలకలం సృష్టిస్తూ కాంట్రాక్టర్లను రాజకీయ నాయకులను బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత వారం రోజుల పరిధిలో నాగారం ఏజెన్సీ పరిధిలో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులకు సంబంధించిన మలిషియా సభ్యులతో పాటు కొరియర్ కూడా అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టుల చర్యలకు పోలీసులు మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానేములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధ పురం (కాస్ రోడ్డు వద్ద తేది: 04.12.2022 నాడు ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ యొక్క కొరియర్ ని వాజేడు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అనుమానస్పద స్తితిలో పట్టుకొని విచారించారు.

దబ్బకట్ల సుమన్ S/O సమ్మయ్య, వయస్సు: 35 సం, కులం:ఎస్‌టి-కోయ, వృత్తి:వ్యవసాయం, r/o తాడ్వాయిగ్రామానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఇట్టి వ్యక్తి 2010వ సంలోప్రభుత్వ నిషేదిత సి.పి.ఐ మావోయిస్ట్ పార్టీ యొక్క విప్లవ భావాలకు పేరేపించబడి.. పార్టీలో సానుభూతి పరులుగా చేరి వారికి సహాయ సహకారాలు అందిస్తూ, తర్వాత కొరియర్ గా మారి పార్టీ ఫండ్ కొరకు తెలంగాణలో జరిగే కాంటాక్టర్ల వివరాలు సేకరించివారి వద్ద నుండి పార్టీఫండ్వసూలు చేసి పార్టీకి అందజేస్తుండే వాడని.. ఇదే క్రమంలో వాజేడు, ఏటూరు నాగారం మరియు తాడ్వాయిలకు చెందిన వివిద రాజకీయ పార్టీల నాయకులైన బోడెబోయిన బుచ్చయ్య, పెనుమాళ్ళు రామకృష్ణ రెడ్డి, కావిరి అర్జున్, లచు పటేల్, బొల్లు దేవేందర్, ఇరసవడ్ల వెంకన్న, దుర్గం రమణయ్య, ఇం(దా రెడ్డి వద్ద నుండి పార్టీ ఫండ్ వసూలు చేయాలనే ఉద్దేశంతో 01.12.2022 నాడు నిషేదిత CPI(మావోయిస్ట్) పార్టీ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు వీరి పేర్లతో లేఖను తన స్వహస్తలతో రాసి మీడియా ద్వారా పంపించడం జరిగింది.

వివిద కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల వద్ద నుండి వసూలు చేసిన రూ.1,00,000/- రూపాయలు తీసుకొని నిషేదిత CPI(మావోయిస్ట్) పార్టీ అగ్ర నాయకులను కలవడానికి వెళ్తుడంగా.. నిన్న అనగా తేది: 04.12.2022 నాడు జగనాధ పురం కాస్ రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి అక్కడ పెట్రోలింగ్చేస్తున్న పోలీస్ వారిని చూసి భయంతో పారిపోవటానికి ప్రయత్నించినాడు.అంతేకాకుండా విచారణలో వారు పలురకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు అని చెప్పాడు.

ఇతని వద్ద నుండిరూ.1,00,000/- రూపాయలు మావోయిస్ట్ పార్టీకి చెందిన నిషేదిత CPI (మావోయిస్ట్)పార్టీకి సంబందించిన విప్లవ సాహిత్యం, సెల్ ఫోన్ లభించగా అతనుఅంగీకరించిన నేరం ప్రకారం ఈ రోజు ఇతనిని అరెస్ట్ చేసి కోర్టు వారి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు పంపనున్నారు.

దీనితో పాటు (గామస్తులందరినీ ప్రభుత్వ నిషేధిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీకి సహకరించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీస్ వారు కోరుతున్నారు. ఏజెన్సీ (గామాలలోఅమాయక గిరిజనులను బలవంతంగా నేరాలకు పాల్పడే విధంగా వారిని (పోద్బలిస్తూ వారి జీవితాలను నక్సల్స్ నాశనం చేస్తున్నారు.

నక్సల్స్ ఎల్లప్పుడూ ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తూ మరియు వారి స్వంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వారిని ఉపయోగించుకున్నారు అని ఏటూర్ నాగారం ఏఎస్పి అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు