Venu Medipelly, News18, mulugu
బుధవారం వెంకటాపుర్మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్నిఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టికె శ్రీదేవి సందర్శించారు. రామప్పలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టి కె శ్రీదేవితో కలిసి సందర్శించారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఆలయ గైడ్ ద్వారా రామప్ప శిల్ప కళా సౌందర్యాన్ని తెలుసుకున్నారు. గుడిలోని రాతి కట్టడాలను, శిల్ప కళా నైపుణ్యాన్ని గైడ్ వివరించారు. పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
Read Also : Rajanna Siricilla: సద్వాల్నా.. వద్దా సార్..! సిరిసిల్ల పిలగాండ్లకు పుస్తకాలే ఇయ్యలే
ఈ సందర్భంగా కలెక్టర్రామప్ప చెరువు ప్రత్యేకతతో పాటు ఉపాలయాల పరిరక్షణకు, నిర్మాణాలకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఆర్ధిక కార్యదర్శి టి కే శ్రీదేవి, కలెక్టర్ రామప్ప చెరువులో బోటింగ్ చేస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి కే శ్రీదేవి మాట్లాడుతూ.. రామప్ప చెరువు కట్టపైనున్న ఆలయాలతో పాటు రామప్ప ఆలయానికి పశ్చిమ భాగంలో ఉన్న కాలభైరవుడి ఆలయాన్ని సందర్శించి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి.. దాని కంప్లీట్ డిపిఆర్ పంపించాల్సిందిగా రాష్ట్ర పురవాస్తు శాఖ అధికారులకు ఆదేశించారు. రామప్ప కట్టడం అద్భుతమని పేర్కొన్నారు.
ఆలయ మండపంలో వారిని అర్చకులు శాలువాలతో సన్మానించి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. రామప్ప ఆలయ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆమె కాసేపు ముచ్చటించారు. రామప్ప విశిష్టత అందరూ తెలుసుకొని ప్రతి విద్యార్థి ఒక ఆర్టికల్ రాసి తనకు పంపించాల్సిందిగా తెలిపారు.
ఆలయం చుట్టూ రామప్ప సరస్సు కట్టపై ఉన్న ఉపాయాలను సందర్శించి వాటికి సంబంధించిన డిపిఆర్ పంపిస్తే పునరుద్ధరణకు సంబంధించి నిధులు మంజూరు చేస్తానని ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. మరి, డీపీఆర్ పంపించడంలో అధికారులు ఎలా స్పందిస్తారు? ఆలయాల పునరుద్ధరణ ఎప్పుడు మొదలవుతుంది? అనే అంశాల గురించి స్థానికులు భక్తులు పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Ramappa Temple, Telangana