MULUGU MULUGU ASSEMBLY CONSTITUENCY TO DIVIDED INTO TWO SNR MMV BRV
Mulugu: ఎన్నికలకు ముందే ఏజెన్సీలో విభజన రాజకీయాలు .. ములుగు జిల్లాలో రెండో నియోజకవర్గం ఏది ..?
(ఆ రెండో నియోజకవర్గం ఏది)
Mulugu: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అటు రాజకీయ నేతల్లాలోనే కాదు ఇటు నియోజకవర్గ ప్రజల్లోనూ వేడి పుట్టిస్తుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అనే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన ఆ ఏజెన్సీ నియోజకవర్గాన్ని రెండుగా చేస్తారనే ప్రచారం కూడా ఉంది.
(Venu Medipelly,News18,Mulugu)
2023 తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికలు అటు రాజకీయ నేతల్లాలోనే కాదు ఇటు నియోజకవర్గ ప్రజల్లోనూ వేడి పుట్టిస్తుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అనే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగానూ స్పందించలేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా 2031 తర్వాతే రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల విభజన(Division of constituencies) ఉంటుందని స్పష్టం చేస్తుంది. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) ముఖ్యంగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల్లోనూ సీట్ల కేటాయింపు విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆశావాహులు, అభ్యర్థులు తమ పార్టీ టికెట్ నాకంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు. ఈ కారణంతో కొన్ని జిల్లాల్లో జిల్లా క్యాడర్ కార్యకర్తల విషయంలో సమన్వయం లేక పార్టీల పరువు మసకబారిపోతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు(Mulugu)జిల్లాలో కూడా నియోజకవర్గాల విభజన, 2023 ఎన్నికల్లో పోటీపై ఆశావహులతో పాటు ప్రజల్లోనూ జోరుగా పైపై ప్రచారాలు సాగుతున్నాయి.
ములుగు నియోజకవర్గంపై న్యూస్ 18 పొలిటికల్ థాట్:
ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ములుగు నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1952 నుంచి 2018 వరకు మొత్తం 16 సార్లు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ జనాభా ఎక్కువగా ఉన్నందున ఈనియోజకవర్గ స్థానాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్కి రిజర్వ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ములుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులే పోటీ పడుతున్నారు. పార్టీ పరంగా అభ్యర్థులు, ఆశావహులు ఉన్నా రిజర్వు స్థానం కావడంతో చేసేదేమీ లేక ఉన్న అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి ఇష్టం ఉన్నా లేకున్నా తమ మద్దతును తెలుపుతున్నారు.
ములుగు జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు?:
తెలంగాణ రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ప్రకారం ములుగు నియోజకవర్గంలో ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి, మంగపేట, కొత్తగూడతో కలిపి ఏడు మండలాలు ఉన్నాయి. మొత్తం 1,92,765 మంది ఓటర్లు ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 82 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 153 కు పెంచాల్సి ఉంటుంది. ఇందులో తప్పకుండా ములుగులో రెండు నియోజకవర్గాలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ములుగు జిల్లా మాత్రం ఒక్కటంటే ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఒకవేళ ములుగు నియోజకవర్గాన్ని రెండుగా విభజిస్తే ములుగు నియోజకవర్గంలో ఒకటి జనరల్ కేటగిరీకి, మరొకటి షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీకి కేటాయించాల్సి ఉంటుందనే వార్తలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. కొత్త మండలాల ప్రకారం ములుగు నియోజకవర్గంలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట్తో పాటు మల్లంపల్లి ప్రాంతాన్ని మండలంగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ నల్లబెల్లి మండలానికి కూడా ములుగు నియోజకవర్గంలో కలిపి మొత్తం ఐదు మండలాలతో ములుగు నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేస్తారని అన్ని పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజలు చెప్పుకుంటున్నారు.
మరో నియోజకవర్గం ఏర్పాటు..
దీంతోపాటు మరొక నియోజకవర్గాన్ని పూర్తిగా రిజర్వ్ (షెడ్యూల్డ్ క్యాస్ట్) స్థానంగా కేటాయిస్తూ దానిలో భాగంగా తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట్, వాజేడు, కొత్తగూడా, కన్నాయిగూడెం మండలాలతో కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. దీని ప్రకారం ములుగు జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే జనరల్ అభ్యర్థితో పాటు షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులకు అవకాశం ఉంటుందని ఆశావహులు భావిస్తున్నారు. అయితే నియోజకవర్గాల పెంపు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు స్పందించకపోవడంతో చిగురించిన ఆశలను చంపేయాల్సి వస్తుంది. ఎప్పటికైనా నియోజకవర్గాల పెంపు ములుగు నియోజకవర్గాన్ని రెండు నియోజకవర్గాలుగా విభజించే అవకాశం ఉందని కచ్చితంగా తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.