హోమ్ /వార్తలు /తెలంగాణ /

పిట్టలదొర ఏకపాత్రాభినయం... కుర్రాడు కేక పెట్టించాడు చూడండి..

పిట్టలదొర ఏకపాత్రాభినయం... కుర్రాడు కేక పెట్టించాడు చూడండి..

X
పిట్టలదొర

పిట్టలదొర గెటప్‌లో అదరగొట్టిన విద్యార్థి

ఒంటిపైన ఖాకీ పాంట్, చెక్క తుపాకీ, తలపై టోపీ పెట్టి ఊరంతా తిరుగుతూ అసాధ్యం కాని ముచ్చట్లను వ్యంగ్య రూపంలో చెబుతూ అందరినీ అలరించే వేషం పిట్టలదొరది. తెలంగాణ ప్రాంతంలో ఈ వేషాన్ని బుడ్డర్ఖాన్ అని కూడా పిలుస్తుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Venu Medipelly, News18, Mulugu)

పిట్టలదొర వేషం. ఆ రోజుల్లో ఈ పాత్ర హాస్యంతోను వ్యంగ రూపంలోనూ ఉండేది. రాను రాను పిట్టలదొర వేషం అంతరించిపోతుంది. గత కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఈ వేషం అందరిని కడుపుబ్బా నవ్వించేది. ఒంటిపైన ఖాకీ పాంట్, చెక్క తుపాకీ, తలపై టోపీ పెట్టి ఊరంతా తిరుగుతూ అసాధ్యం కాని ముచ్చట్లను వ్యంగ్య రూపంలో చెబుతూ అందరినీ అలరించే వేషం పిట్టలదొరది. గతంలో ఈ పేరుపై సినిమా కూడా వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఈ వేషాన్ని బుడ్డర్ఖాన్ అని కూడా పిలుస్తుంటారు.. అలాగే పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎంతో నైపుణ్యాలు దాగి ఉంటాయి. ఉపాధ్యాయులు వాటిని వెలికి తీసే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. అందుకే ఉపాధ్యాయులను నిరంతర విద్యార్థి అని సంబోధిస్తుంటారు. ఏ విద్యార్థిలో ఏ ప్రతిభ దాగిందో కనిపెట్టాల్సిన అవసరం టీచర్లపై ఉంటుంది.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి ఉన్నత పాఠశాలలో విజయ్ పదో తరగతి చదువుతుంటాడు. దీనికి అనుగుణంగా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత కలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కళా ఉత్సవ పోటీలను నిర్వహించింది. మారుమూల ప్రాంతంలో ఉండే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో అడ్మిషన్లు కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చల్వాయి పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ప్రభుత్వం పాఠశాలలపై పిల్లలకు ఆసక్తి పెరగాలని విద్యార్థులకు అనేక కళలను నేర్పిస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా కల ఉత్సవ పోటీలలో విజయ్ అనే విద్యార్థితో పిట్టలదొర వేషం వేయించాడు. మండల స్థాయితో పాటు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు విజయ్. అంతేకాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు సైతం ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు.

Warangal: ఈ సర్కస్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

పిట్టలదొర వేషం వేసిన విజయ్ తో మాట్లాడే ప్రయత్నం న్యూస్ 18 చేసింది...

పిట్టలదొరవేశం ఒకప్పుడు తెలంగాణలో చాలా ఫేమస్ అందరిని కడుపుబ్బ నవ్విస్తూ గొప్పలు చెప్పుకుంటూ అసత్యాలను సులువుగా ప్రజలకు హామీల రూపంలో చెప్పుకుంటూ నవ్విస్తూ ఉండే ఒక వేషం. దీనిలో భాగంగా మా తెలుగు ఉపాధ్యాయుడు నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. అందుకే మొదటిగా వారందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని విజయ్ చెప్పాడు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలపై మరింత ఆసక్తి కల్పించాలని ఉద్దేశంతో పాఠశాలలోని విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ వారికి ఏ రంగంపై ఆసక్తి ఉంటుందో వాటిపై అవగాహన కల్పిస్తూ విద్యా బోధన చేస్తున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అంతరించిపోయే కలలను ఈరోజుల్లో విద్యార్థులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్తున్నా ఉపాధ్యాయులను మెచ్చుకోవాల్సిందే.

First published:

Tags: Local News, Mulugu

ఉత్తమ కథలు