Home /News /telangana /

MULUGU MULLA KATTA BRIDGE THAT CONNECTS TELANGANA WITH CHATTISHGARH IS BUILT STRATEGICALLY MMV BRV ABH

రెండు కిలోమీటర్ల వంతెన.. 300 కిలోమీటర్లతో సమానం.. ఎక్కడో మీరే చూసేయండి

రెండు

రెండు రాష్ట్రాలను కలుపుతున్న ముళ్లకట్ట వంతెన. తగ్గిన 300 కిలోమీటర్లు దూరం

163వ నెంబర్ గల జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ములుగు జిల్లాలను కలుపుతూ వెళ్లే ఈ జాతీయ రహదారి రెండు రాష్ట్రాల మధ్య ఎంతో కీలకంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    వేల కిలోమీటర్ల దూరాన్ని సైతం తగ్గిస్తూ... రవాణా వ్యవస్థలో కీలకంగా మారుతున్నాయి వంతెనలు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో నదులు దాటేందుకు నిర్మించిన వంతెనలతో ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయి. అటువంటి ఒక కీలక వంతెన గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. 163వ నెంబర్ గల జాతీయ రహదారి హైదరాబాద్ (Hyderabad) నుంచి ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని భూపాలపట్నం వరకు ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ (Warangal), ములుగు జిల్లా (Mulugu District) లను కలుపుతూ వెళ్లే ఈ జాతీయ రహదారి రెండు రాష్ట్రాల మధ్య ఎంతో కీలకంగా మారింది. అయితే తెలంగాణ (Telangana) నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నంకు చేరుకోవాలంటే మార్గమధ్యలో ములుగు జిల్లాలో గోదావరి నదిపై వంతెన దాటాల్సి ఉంటుంది.

    ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం సరిహద్దులో వాజేడు మండలం ఆరంభానికి ఆనుకొని రెండు మండలాల మధ్య గోదావరి నది ప్రవహిస్తుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు ఈ నదిపై వంతెన లేక..ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు కూర్చి చుట్టూ 300 కిలోమీటర్లు ప్రయాణించేవారు. స్థానికులు కేవలం నాటు పడవల ద్వారా మాత్రమే గోదావరి నది దాటేవారు. నదిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈక్రమంలోనే ఈ నదిపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో 300 కిలోమీటర్ల దూరం ఒకటిన్నర కిలోమీటర్‌కు తగ్గింది.

    ఇది చదవండి: పనికిరాని వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు: మీరే ఆశ్చర్యపోతారు


    రెండు రాష్ట్రాల మధ్య కీలకంగా ముళ్లకట్ట వంతెన:
    ములుగు జిల్లాలోని ఏటూరునాగారం - వాజేడు మండలాల మధ్య గోదావరి నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నదిపై వంతెన నిర్మిస్తే స్థానికంగా ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగు పర్చుకోవచ్చని జాతీయ రోడ్డు రవాణా సంస్థ భావించింది. వంతెన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు రాకపోకలు సులువుగా జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి మేజర్‌గా చెప్పుకునే ఈ వంతెన తెరుచుకోవడంతో ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లేందుకు 300 కిలోమీటర్ల దూరం తగ్గినట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. గోదావరి నది మూల మలుపు తిరిగే ప్రదేశం ఈ వంతెన పై నుంచి చూస్తుంటే ఎంతో రమణీయంగా ఉంటుందని స్థానికులు, పర్యాటకులు అంటున్నారు.

    ఇది చదవండి: రాజన్నకు ఇలాంటి కోడెలను అస్సలివ్వొద్దు.. అర్చకులు ఏం చెబుతున్నారంటే..! 


    వంతెన నిర్మాణం: ముళ్లకట్ట వంతెన నిర్మాణం 2012 సంవత్సరంలో ప్రారంభించగా 2016లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. మొత్తం 1.8 కిలోమీటర్లు పొడవుతో 41 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దాదాపు రూ. 340 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వంతెనను నిర్మించాయి.

    Read this Also; Mulugu: రేషన్ బియ్యంను పక్కదారి పట్టిస్తున్న మాయగాళ్లు: ఒకే చోట 60 క్వింటాళ్ల బియ్యం



    సెల్ఫీల స్పాట్, ప్రమాదంలో పర్యాటకులు: గోదావరి నదిపై నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో స్థానికంగా ఉండే పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల పర్యాటకులువస్తున్నారు. ఈక్రమంలో వంతెన వద్ద లోకేషన్ సుందరంగా ఉండటంతో అనేకమంది పర్యాటకులు జాతీయ రహదారిపైనే తమ వాహనాలను నిలిపి.. ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి కావడంతో ఇతర వాహనాల రద్దీ ఉంటుంది. కాబట్టి పర్యాటకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Mulugu, Telangana

    తదుపరి వార్తలు