హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఒక్క మ్యూజియం..350 కళాఖండాలు..ఎక్కడో తెలుసా?

ఒక్క మ్యూజియం..350 కళాఖండాలు..ఎక్కడో తెలుసా?

X
tribal

tribal museum

ఆదివాసీ ప్రజల జీవన విధానం, సాంప్రదాయం చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. నేటి సమాజంలో ఆదివాసి ప్రజల జీవన విధానాన్ని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కానీ భవిష్యత్తు తరాలకు ఆదివాసీల చరిత్ర జీవన విధానం తెలియజేయడం కోసం మ్యూజియాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో ట్రైబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైబల్ మ్యూజియంలో 350కి పైగా కళాఖండాలను సందర్శకులకి అందుబాటులో ఉంచారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి

లొకేషన్ : మేడారం

ఆదివాసీ ప్రజల జీవన విధానం, సాంప్రదాయం చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. నేటి సమాజంలో ఆదివాసి ప్రజల జీవన విధానాన్ని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కానీ భవిష్యత్తు తరాలకు ఆదివాసీల చరిత్ర జీవన విధానం తెలియజేయడం కోసం మ్యూజియాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో ట్రైబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైబల్ మ్యూజియంలో 350కి పైగా కళాఖండాలను సందర్శకులకి అందుబాటులో ఉంచారు.

Warangal: వరంగల్ మార్కెట్లో జీరో దందాపై అధికారుల సీరియస్

మేడారం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. మేడరాజు కాకతీయులతో విరోచితంగా యుద్ధంలో పాల్గొన్నారని, ఈ యుద్ధ సమయంలోనే సమ్మక్క సారలమ్మలు వీరమరణం పొందారని, సమ్మక్క నెత్తురోడుతూ చిలకలగుట్ట ప్రాంతంలో అదృశ్యమైందని, జంపన్న సంపంగ వాగులో దూకి తను చాలించారని అప్పటినుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా మారిందని అనేక మంది.. అనేక రకాలుగా చెప్పుకుంటారు. కానీ లిఖించబడ్డ చరిత్రలో మేడారం రాజు కాకతీయులతో యుద్ధం చేసినట్టు ఎక్కడా లిఖించబడలేదు. కాకతీయుల చరిత్ర వరంగల్ జిల్లా ప్రాంతంలో 12వ శతాబ్దం నుంచి కనిపిస్తుంది. ఆ సమయంలోనే మేడరాజు కాకతీయులకు సామంత రాజుగా ఉన్నాడని చెప్పుకుంటారు. కానీ మేడారం ప్రాంతం గురించి కానీ, మేడారం రాజుల గురించి కానీ, గిరిజన గురించి గానీ లిఖించబడ్డ చరిత్రలో ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ అనేక మంది చరిత్రకారులు అనేక మంది గిరిజన ప్రాంతాలపై గిరిజన ప్రజలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వాటికి నిలువెత్తు నిదర్శనం మేడారంలోని ట్రైబల్ మ్యూజియంలో అనేక కళాఖండాలు నేటికీ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.

BRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..లంచ్ మోషన్ కు హైకోర్టు అనుమతి

మేడారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంలో దాదాపు 350కి పైగా కళాఖండాలు సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఈ మ్యూజియంలో ఆదివాసీల జీవన విధానం, వారిసాంప్రదాయాలు, ఆచారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. అనాది కాలంలో గిరిజనులు వాడిన పనిముట్లు ఏ విధంగా ఉన్నాయి. వారి యొక్క సాంప్రదాయం ఏ విధంగా ఉంది.. వారి యొక్క వేషాధారణ ఏ విధంగా ఉందనే అనేక ప్రశ్నలకు ట్రైబల్ మ్యూజియంలో సమాధానాలు దొరుకుతాయి. మేడారం వనదేవతలను సందర్శించిన అనంతరం చరిత్రపై ఆసక్తి కలిగిన చరిత్ర తెలుసుకోవాలని కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు.

కానీ నేటి భవిష్యత్తు తరాలకు ఆదివాసీల చరిత్ర వారి యొక్క మనుగడ ఏ విధంగా ఉందో తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివాసీల జీవన విధానాలు, వారి యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మేడారం ప్రాంతంలోని ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించాలనుకునే వారు పూర్తి వివరాల కోసం మేడారం మ్యూజియం క్యూరేటర్ కురుసం రవి (9491609775) అధికారిని సంప్రదించవచ్చు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు