జయశంకర్ భూపాలపల్లిలోని టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలోని మిర్చి పంటలను శుక్రవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క (Mulugu MLA Seethakka) పరిశీలించారు. భూపాలపల్లి (bhupalapally) నియోజకవర్గ రైతు పక్షపాతి ప్రజానాయకుడు గండ్ర సత్యనారాయణ, కోటగిరి సతీష్ గౌడ్, బండ శ్రీకాంత్, మాజీ సర్పంచులు పెరుమండ్ల లింగయ్య, రాజమౌళి, కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రాజు, మధుకర్ విగ్నేష్ అనీల్ తదితరులు పాల్గొనన్నారు. ఈ సందర్భంగా రైతులకు (Farmers) ఎమ్మెల్యే సీతక్క ధైర్యం చెప్పారు. టేకుమట్ల మండలంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల పట్ల సీతక్క స్పందించారు. ప్రభుత్వం (Government) తక్షణమే రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగాన్ని (Farmers sector) ఆదుకునేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీతక్క పిలుపునిచ్చారు. ఒక ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన మిర్చి రైతులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సీతక్క ఆవేదన వ్యక్తంచేశారు.
ఆత్మస్థైర్యం కల్పించడంలో విఫలమయ్యారు..
ప్రభుత్వం భరోసా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రైతుల వద్దకు వెళ్లి కనీసం ఆత్మస్తైర్యం కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.టేకుమట్ల మండలంలో సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతు రవీందర్రావు మిర్చితోటలో, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, గుమ్మడవెల్లి గ్రామంలో దళిత రైతు అక్కినపల్లి సారయ్య పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో ప్రభుత్వం కొనక..
రైతులు చనిపోతుంటే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు (TRS Leaders) రైతుబంధు సంబురాలు చేస్తున్నారని మండిపడ్డారు సీతక్క. తెలంగాణలో ఎక్కడా కూడా రైతులు సంతోషంగా లేరని ఎమ్మెల్యే అన్నారు. మిర్చి పంటలు నాశనం కావడంతో, వరి పంట పండిస్తే సకాలంలో ప్రభుత్వం కొనక, తరుగు పేరుతో ఒక బస్తా, మూడు నుండి నాలుగు కిలోలు, ఒక క్వింటాలుకు 10 నుండి 12 కిలోల కోత విధిస్తూ మిలర్లతో ప్రభుత్వం కుమ్మకై, నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారని సీతక్క ఆరోపించారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వం, రైతుల రక్తం తాగే ప్రభుత్వమని సీతక్క మండిపడ్డారు .
వందల ఎకరాలు ఉన్న నాయకులకు లక్షల్లో, కోట్లలో రైతుబంధు డబ్బులు పడితే, వాళ్ళు సంబరాలు (Raithubandhu celebrations) చేసుకుంటూ ఈ రోజు రైతుల సంబరాలు అంటున్నారని సీతక్క అన్నారు.ఆ విషయాన్ని తెలంగాణ రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. మీరు రైతు సంబురాలు బంద్ చేసి, రైతు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లాలని సీతక్క సూచించింది. పంటలను పరిశీలించి రైతులకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించి, ప్రభుత్వం తరఫున మిర్చి రైతులకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.