హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మేడారం వనదేవతలకు బతుకమ్మ చీరలు .. తొలి చీరను సమర్పించిన మంత్రి

Mulugu: మేడారం వనదేవతలకు బతుకమ్మ చీరలు .. తొలి చీరను సమర్పించిన మంత్రి

mulugu

mulugu batkamma sarees

Mulugu: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ మొదటి చీరను సమర్పించింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మొదటి చీరను సమ్మక్క సారలమ్మ తల్లులకు సమర్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly,News18,Mulugu)

  తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ (Bathukamma)పండుగ అంటే ఎంతో సంబరం, అలాగే ఎంతో గౌరవం. తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలతో సంతోషంగా బతుకమ్మ ఆడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ములుగు(Mulugu)జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా చీరల(Sarees) పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు.

  Bhadradri: నిర్మాణం పూర్తైన ప్రారంభోత్సవానికి నోచుకోని కలెక్టరేట్ .. కారణం ఆ పెద్దసారే..!

  మొదటి చీర వనదేవతలకు:

  ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ మొదటి చీరను సమర్పించింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా చైర్ పర్సన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య వనదేవతలను దర్శించుకుని చీర సమర్పించడం కోసం మేడారం చేరుకున్నారు. వీరికి గిరిజనులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలుకగా మొదటి చీరను సమ్మక్క సారలమ్మ తల్లులకు అధికారులు సమర్పించారు. ములుగు గట్టమ్మ వద్ద బతుకమ్మ చీరలు గట్టమ్మతల్లికి సమర్పించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు.

  మళ్లీ మంత్రికి చేదు అనుభవం:

  రెండు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌కి అడ్డుపడి నిరసన తెలిపిన ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందులో తమకు అన్యాయం జరిగిందని టిఆర్ఎస్ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ములుగులో చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సత్యవతి రాథోడ్ పర్యటనకు ములుగు జిల్లా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రాకపోవడం మళ్లీ చర్చానియాంశంగా మారింది. దీంతో ములుగు జిల్లాలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో మళ్లీ ముసలం మొదలైనట్లే తెలుస్తుంది.

  Urban Farming : ఇంటి మిద్దెలు, బాల్కనీలోనే కూరగాయల సాగు .. ప్రతి నాల్గో ఆదివారంట్రైనింగ్‌ ..ఎక్కడిస్తారంటే ..

  ఉపాధితో పాటు ఆత్మగౌరవం:

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం వల్ల సిరిసిల్ల చేనేత కార్మికులకు ఎంతో ఉపాధి లభిస్తుంది. దాదాపు 17 రకాల చీరలను 210 డిజైన్లతో సిరిసిల్ల చేనేత కార్మికులు నేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 1 లక్ష 12 వేలకు పైగా చీరలను మంజూరు చేసింది. ములుగు మండలానికి 22,466, మంగపేట మండలానికి 17886, వెంకటాపురం మండలానికి 13263, గోవిందరావుపేట్ మండలానికి 11980, వెంకటాపూర్ మండలానికి 12308, ఏటూరు నాగారం మండలానికి 11072, వాజేడు మండలానికి 9955, కన్నాయిగూడెం మండలానికి 4754 మొత్తం కలిపి 1,12,062 చీరలు మంజూరవగా 80 వేల చీరలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా చీరలు కూడా త్వరలోనే వచ్చేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 222 రేషన్ దుకాణాల ద్వారా ఈ చీరలను పంపిణీ చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu, Telangana News

  ఉత్తమ కథలు