Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) లో పోడు రైతులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తున్నారు. పోడు భూముల సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వంద శాతం సర్వే, గ్రామ సభలు పూర్తి చేసామని చెప్తున్నారు. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలలో ఆనందం వెళ్లి విరుస్తుంది. అర్హత ఉన్న గిరిజన గిరిజన అందరికీ పోడు భూములు సంబంధించి పట్టాలు త్వరలోనే రానున్నాయి. గిరిజనులకు ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుండగా.. దీనికి అవసరమైన చర్యలు అధికారులు పూర్తి చేస్తున్నారు.
అడవులను సంరక్షిస్తూనే అలాగే చట్టంకు లోబడి సాగు చేస్తూన్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు భూముల పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. పోడు భూముల కోసంపెద్ద ఎత్తున చర్చ జరిగి సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను కొలిక్కి తీసుకొని రావడం జరిగింది. పోడు భూముల పట్టాల పంపిణీ అనంతరం మరో గజం భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అన్ని పక్షాల ప్రతినిథులతో తదుపరి గ్రామాలో అటవీ సంరక్షణకు కట్టుబడి ఉండేలా,ఆక్రమణ కాకుండా తీర్మానం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలనుతప్పకుండా పాటిస్తూ అర్హులందరికీ పోడు పట్టాల పంపిణీ జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది. జిల్లా కలెక్టర్ లకు సంబంధించిన డి.ఎల్.సి మాడ్యుల్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
రెండు రోజుల్లో ఎస్డిఎల్సి నుంచి వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది. గ్రామ సభల తీర్మానాలు, ఎస్.డి.ఎల్.సి మధ్య ఉన్న గ్యాప్ పై జిల్లాలో కలెక్టర్ లు సమీక్షించాలని, గిరిజనులకు సంబంధించి చట్టం ప్రకారం రెండు ఆధారాలు ఉంటే తప్పనిసరిగా ఆమోదించాలనిఉన్నత అధికారులు ఆదేశిస్తున్నారు.పోడు భూముల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తు తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేసిన అవసరం ఉంటుంది.
జిల్లాలో కలెక్టర్ లు ముందస్తుగా ఎస్.డి.ఎల్.సి పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్ పూర్తి చేయాలి. ప్రజల దశాబ్దాల కలను ప్రభుత్వం సాకారం చేస్తూ పట్టాలు పంపిణీ చేస్తుందని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరాలని, ఎస్.డి.ఎల్.సి హోల్డ్ లో పెట్టిన దరఖాస్తులు, తిరస్కరించిన దరఖాస్తులను కలెక్టర్ లు మరోమారు పరిశీలించిమార్గదర్శకాల ప్రకారం రెండు ఆధారాలు ఉంటే ఆమోదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana