హోమ్ /వార్తలు /తెలంగాణ /

మావోయిస్టుల వార్నింగ్ లెటర్.. నేతల గుండెల్లో రైళ్లు..! ఏజెన్సీలో అలజడి

మావోయిస్టుల వార్నింగ్ లెటర్.. నేతల గుండెల్లో రైళ్లు..! ఏజెన్సీలో అలజడి

ములుగు ఏజెన్సీలో మావోయిస్టుల లేఖల కలకలం

ములుగు ఏజెన్సీలో మావోయిస్టుల లేఖల కలకలం

ములుగు జిల్లా (Mulugu District) లో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. మావోయిస్టు వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ లేక విడుదలవడం రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

ములుగు జిల్లా (Mulugu District) లో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. మావోయిస్టు వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ లేక విడుదలవడం రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సాధారణంగా మావోయిస్టులు హెచ్చరిస్తూ కరపత్రాలు పోస్టర్లను విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మావోయిస్టులు ముందడుగు వేసి కొందరి రాజకీయ నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ లేఖరు విడుదల చేయడం ములుగు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం ఏర్పడింది...."విప్లవ ప్రజా ద్రోహుల్లారా ఖబర్దార్ ములుగు జిల్లాలో కొంతమంది వివిధ రాజకీయ పార్టీలలో ఉంటూ పోలీసు కను సన్నల్లో ఉంటూ మావోయిస్టు పార్టీ సమాచారం సేకరిస్తూ పోలీస్ నిఘా వర్గాలకు చేరవేస్తూ పబ్బం గడుపుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ద్రోహుల్లారా మీ యొక్క పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ"భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు.

ఈ లేఖ కొందరి రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. వాజేడు మండలంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధ బోయిన బుచ్చయ్య, రామకృష్ణారెడ్డి గిరిజన గ్రామాలలోని యువతను తప్పుదారి పట్టిస్తూ పెద్ద కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఇసుక దందాకు పాల్పడుతున్నాడని.. ఎదురు ప్రశ్నించిన యువతను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరించి తప్పుడు కేసులు పెడుతున్నాడని.. పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై డెడ్ లైన్.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

కావేరి అర్జున్, అర్రెం లచ్చు పటేల్, బొల్లు దేవేందర్, ఇరుపవడ్ల వెంకన్న వీరందరూ వివిధ పార్టీలలో ఉంటూ ఇసుక వ్యాపారం కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి విచ్చల వేడిగా దోచుకుంటున్నారని.. ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి గోవిందరావుపేట మండలాలలోని వ్యాపారస్తుల నుంచి లక్షల రూపాయల డబ్బులను వసూలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని.. ఎదురు వచ్చిన వారిని చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

దుర్గం రమణయ్య ఇంద్రారెడ్డి అనే వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటూ పోలీస్ వారికి అనుగుణంగా ఉంటూ వారికి కావలసిన సమాచారం ఇస్తూ వారి సపోర్ట్ తో భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులను సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారు. మావోయిస్టులు ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించవలసిన అధికారులు అధికార పార్టీ నాయకులతో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తూ అవినీతి మత్తులో ములుగుతున్నారని వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం ఖన్నాయిగూడెం మంగపేట మండలాలలో ఎమ్మార్వోలుభూ సమస్యలను పట్టించుకోవడంలేదని గేదెల గ్రామాలలో ప్రజలకు కాంట్రాక్టర్లకు గొడవలు పెట్టిస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని.. ఒక గ్రామంలో ఒకే ఇసుక సొసైటీ ఉండాలని మిగతా వాటిని రద్దు చేయాలని.. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వారి యొక్క పద్ధతి మార్చకుంటే వారోత్సవాల నేపథ్యంలో గోరి కట్టక తప్పదని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. లేఖ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరుతో విడుదల చేయడం.. ఇప్పటికే రాజకీయ నాయకులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినట్లు నగర ప్రాంతాలలోని పెద్ద పెద్ద హోటల్ లో తలదాచుకున్నట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

First published:

Tags: Local News, Maoists, Mulugu, Telangana

ఉత్తమ కథలు