హోమ్ /వార్తలు /తెలంగాణ /

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. తనకు తానుగా పోలీసుల దగ్గరకు వెళ్లి..

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. తనకు తానుగా పోలీసుల దగ్గరకు వెళ్లి..

లొంగిపోయిన మావోయిస్టు నేత

లొంగిపోయిన మావోయిస్టు నేత

Telangana: ములుగు జిల్లా దండకారణ్యంలో మావోయిస్టు తలదాచుకున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి పోలీసులు ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతాన్ని అణువు అణువు అన్వేషిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, Mulugu

ములుగు జిల్లా దండకారణ్యంలో మావోయిస్టు తలదాచుకున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  దీంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో అటవీ ప్రాంతాన్ని అణువు అణువు అన్వేషిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మావోయిస్టు సానుభూతి పరులను ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారందరూ మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ ను కలుస్తున్నట్టు చెప్పారు.దీన్నిబట్టిచూస్తేమావోయిస్టు అగ్రికల్ తెలంగాణ అడవుల్లోనే తలదాచుకున్నారా అనే సందేహాలకు ఈ ఘటన బలం చేకూరింది

ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా ఓఎస్డి అశోక్ కుమార్ ఐపిఎస్ ఎదుట సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు యాక్షన్ టీం కమాండర్ ఏరియా కమిటీ సభ్యుడు మీడియం జోగయ్య అలియాస్ జోగు అలియాస్ జోగులు లొంగిపోయాడు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం యాక్షన్ టీం కమాండర్ మీడియం జోగయ్య 2016లో మావోయిస్టు పార్టీలో చేరాడు.సోడి నర్సింగరావు, పూజారి కాంకేర్ అప్పటి మిలీషియా కమాండర్ మాటలకు ఆకర్షితుడయ్యాడు.

మావోయిస్ట్ పార్టీ భావజాలనికి ఆసక్తి చూపి 2016 సంవత్సరంలో మిలీషియా లో చేరాడు.అనంతరంసోడి నర్సింగరావు దగ్గర ఒక సంవత్సరం పని చేశాడు. ఈ కాలంలో మీడియం జోగయ్య12 బోర్ వేపన్ కలిగి ఉన్నాడు. 2017 సంవత్సరంలో అతను పార్టీ సభ్యునిగా పదోన్నతి పొందాడు మరియు చెర్ల స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ (SGS) కి బదిలీపైవెళ్లాడు. ఇక్కడ లచ్చన్న ఆద్వర్యంలో పని చేశాడు.

అక్కడ అతను అక్టోబర్ 2020 వరకు పార్టీ సభ్యునిగా పనిచేశాడు.ఆ తర్వాత, అతను 2020 సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ (ACM)గా పదోన్నతి పొంది దామోదర్ ప్రొటెక్షన్ కమిటీ కి బదిలీ అయ్యాడు. అతన్ని "యాక్షన్ టీమ్" సభ్యునిగా తీసుకున్నారు. మరియు యాక్షన్ టీమ్ కమాండర్గా పదోన్నతి పొందారు మరియు ఆగస్టు 2022 వరకు పనిచేశారు.మీడియం జోగయ్య పై నాలుగు లక్షల రివార్డు ఉంది.

జోగయ్య పాల్గొన్న హత్యలుఎన్ కౌంటర్లు:దామోదర్, సుధాకర్ సూచనల మేరకు మహేందర్, దీపక్, జోగాలు, సుక్కలు, విజ్ఞలు, సోడి వీరయ్య లతో కలసి వెంకటాపురం మండలం ఆలుబాకకు, చెందిన భీమేశ్వర్ రావు హత్యలో పాల్గొన్నాడు.చతిస్గడ్ పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరి కానిస్టేబుల్ కాల్చిన ఘటనలో కూడా పాల్గొన్నాడు.చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మణ్ హత్య కేసులో సైతం ఇతను పాల్గొన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఛత్తీస్ఢ్లోని కర్రెగుట్టలులో బేఛిరాకుమాడుగు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మీడియం జోగయ్య పై వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి, చెర్ల, ఎడుల్లా బయ్యారం PS లోని వివిధ కేసులలోపాల్గొన్నాడు.

తీవ్రవాద కేసులు:జోగయ్యకర్రెగుట్టలు ప్రాంతంలో ఎన్నో బాంబులు అమర్చినట్లుకేసులున్నాయి. మావోయిస్టుల భావజాలం పట్ల విరక్తి మరియు ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి దోపిడీ సొమ్మును ముఖ్య నేతలు పంచుకుంటున్నారు.విపరీతమైన పనిభారం, తిండిలో తక్కువ క్యాడర్ల పట్ల వివక్ష చూపడం మరియు వారిని విచక్షణారహితంగా కొడుతున్నారు.

అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని సాధారణ జీవితం గడపడానికి మావోయిస్టు పార్టీని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి నిర్ణయించుకున్నాడు ఈ నేపథ్యంలోనే ములుగు ఓఎస్డి అశోక్ కుమార్ ఎదుట లొంగిపోయాడు. ఇప్పటికైనా అటవీ ప్రాంతంలో తలదాచుకున్న మావోయిస్టులు లొంగిపోవాలని అందించే సంక్షేమ ఫలాలు పథకాలు సద్వినియోగం చేసుకోవాలని లొంగి పోయినవారికి ప్రభుత్వం నుంచి సహాయం చేయడం జరుగుతుందనిఅశోక్ కుమార్ ఐపీఎస్ చెప్తున్నారు

First published:

Tags: Local News, Maoists, Mulugu, Telangana

ఉత్తమ కథలు