Home /News /telangana /

MULUGU LOCALS FEAR FOR THEIR LIFE WHEN KATAKSHAPUR LAKE OVER FLOWING DURING RAINS DEMAND FOR NEW BRIDGE MMV BRV ABH

Mulugu: కటాక్షపూర్ చెరువు కష్టాలు...ఇప్పటికైనా కటాక్షపురం చెరువుకు కటాక్షం దొరికేనా

సిఆర్

సిఆర్ గుర్తు చేసిన కటాక్షపూర్ చెరువు కష్టాల గురించి మీకు తెలుసా

దశాబ్దాలు గడుస్తున్నా అధికారులు నిద్ర మబ్బు ఎందుకు వీడట్లేదు? ప్రతి వర్షాకాలంలో వాహనదారులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కటాక్షపూర్ గ్రామంలోని కటాక్షపూర్ చెరువు 163వ నెంబర్ గల జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    దశాబ్దాలు గడుస్తున్నా అధికారులు మాత్రం నిద్ర మబ్బును ఎందుకు వీడట్లేదు? ప్రతి వర్షాకాలంలో వాహనదారులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు? ఉమ్మడి వరంగల్(warangal) జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్(katakshapur) గ్రామంలోని కటాక్షపూర్ చెరువు 163వ నెంబర్ గల జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. చూడటానికి చాలా సుందరంగా కనిపించే ఈ చెరువు (pond) స్థానికంగా సాగు నీటి వనరుగానూ, అలాగే మత్స్య సంపదకు కూడా అనువుగా ఉంటుంది. అంతా బాగానే ఉంది మరి సమస్య ఏమిటి అనుకుంటున్నారా?.

    కేసీఆర్ గుర్తుచేసుకున్న చెరువు:
    ప్రతి వర్షాకాలంలో కటాక్షపూర్ చెరువు మత్తడి పారుతుంది. దీంతో చెరువు పై నిర్మించిన లోలెవెల్(lolevel) వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. వరద నీరు వంతెనపై నుంచి నడుం లోతులో పారుతుంది. ఇక్కడ ప్రయాణించాలంటే వాహనదారులు(Motorists) బెంబేలెత్తుతున్నారు. భారీ వర్షం కురిస్తే చాలు కటాక్షపూర్ చెరువు మత్తడి దూకుతుంది. నిజానికి కటాక్షపూర్ చెరువుకు ప్రత్యేకంగా మత్తడి అంటూ లేదు భారీ వర్షం కురిస్తే చెరువు నిండుకుండలా మారి.. వరద నీరు రహదారి పైనుంచే పోతుంది. ప్రతి వర్షాకాలంలో జాతీయ రహదారి పైనుంచి మూడు అడుగుల మేర లోతులో నీరు ప్రవహిస్తుంది. దీంతో అప్పటి వరకు రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇలా చెరువు మత్తడి పారడం వాహనదారులను ఇబ్బందికి గురిచేస్తుంది. కొద్ది రోజుల క్రితం ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది(Godavari river) పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం కేసీఆర్(KCR) రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తూ కటాక్షపూర్ చెరువు గురించి ప్రస్తావించారు. ఉద్యమ కాలంలో ఇక్కడ అనేక మంది చేపలు పడుతూ ఉండేవారని కేసీఆర్(KCR) గుర్తు చేసుకున్నారు. కానీ అదే చెరువు వద్ద వాహనదారులు కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే అది మాత్రం ఎందుకు గుర్తుకురావడం లేదోనని స్థానికులు, ఇతర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Read This also; Mulugu: రామప్ప ఆలయాన్ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు! ఆగస్టు 15 స్పెషల్..



    వానోస్తే ఒక భయం.. వెళ్ళాక మరొక భయం:
    వర్షాకాలంలో ఇక్కడ ప్రయాణించాలంటే రోడ్డుపైన ఎక్కడ గుంత ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గిన అనంతరం కూడా ఈ రహదారి సరిగ్గా ఉంటుందా అంటే అదీ లేదు. వరద ప్రవాహానికి రహదారి మొత్తం అద్వానంగా తయారవుతుంది. మరమ్మత్తులు చేయడంలో అధికారులు కూడా నిర్లక్ష్యం(Neglect) ప్రదర్శిస్తూ ఉంటారు. దశాబ్దాలు గడుస్తున్నా కటాక్షపూర్ చెరువు వద్ద హై లెవెల్ వంతెన ఎందుకు నిర్మించడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్(KCR) కటాక్షపూర్ చెరువును గుర్తుచేసుకున్నందుకు సంతోషపడాలో లేదా ఇక్కడ రహదారిని నిర్లక్ష్యంగా వదిలేశారని బాధపడాలో అర్థం కావడం లేదని కటాక్షపూర్ గ్రామస్తులు చెప్తున్నారు. వర్షాకాలం రహదారిపై ప్రయాణించాలంటే వరద ప్రవాహంలో తమ వాహనం ఎక్కడ కొట్టుకుపోతుందో అనే భయంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మత్తడి దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం అనంతరం వరదలకు కొట్టుకపోయిన రహదారిని సైతం అధికారులు పట్టించుకోరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కటాక్షపూర్ చెరువు వద్ద ఒక హై లెవెల్ వంతెనను నిర్మించి వాహనదారులకు, స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
    First published:

    Tags: Local News, Mulugu, Telangana, Water problem

    తదుపరి వార్తలు