Home /News /telangana /

MULUGU LOCALS AGITATING FOR MALLAMPALLY MANDAL IN MULUGU DISTRICT ABH BRV MMV

Mulugu: మండల కేంద్రంగా ప్రకటించాలని ఏళ్లకేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న గ్రామస్థులు!... 

మల్లంపల్లి

మల్లంపల్లి మండలం కోసం ఉద్యమిస్తున్న స్థానికులు

అసెంబ్లీ ఎన్నికలైనా, గ్రామ సర్పంచ్ ఎన్నికలైనా రాజకీయ నేతలు ఇక్కడి గ్రామస్థులకు ఇచ్చే ఒకే ఒక్క హామీ మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం. హామీలు అయితే ఇచారుగాని, దాన్ని అమలుపరిచే విషయమై ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు

ఇంకా చదవండి ...
  (M.Venu, News18, Mulugu)

  ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ ఏళ్లకేళ్లుగా ఆ గ్రామస్థులు చేస్తున్న పోరాటం చేస్తున్నారు. ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలైనా, గ్రామ సర్పంచ్ ఎన్నికలైనా రాజకీయ నేతలు ఇక్కడి గ్రామస్థులకు ఇచ్చే ఒకే ఒక్క హామీ మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం. హామీలు అయితే ఇచారుగాని, దాన్ని అమలుపరిచే విషయమై ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. 2018 ములుగు ప్రాంతంలో బహిరంగ సభలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమయంలో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా మల్లంపల్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు హామీ ఇచ్చిన మల్లంపల్లి ప్రాంతాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంలో రాజకీయ నాయకులు విఫలం అయ్యారని ఇక్కడి గ్రామస్థులు అంటున్నారు.

  ములుగు జిల్లా రాక ముందు నుంచే మండలం కోసం ప్రయత్నాలు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాక ములుగు కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే ములుగు జిల్లా ఏర్పాటు కాకముందు నుంచే మల్లంపల్లి ప్రాంతాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే వాదన ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని గ్రామస్థులు చెప్తున్నారు. మల్లంపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉండే మైనింగ్ ద్వారా ములుగు జిల్లాకు సంవత్సరానికి దాదాపు రూ. 10 కోట్లకు పైగానే రాయాలిటీ రూపంలో ఆదాయం వస్తుందని స్థానికులు అంటున్నారు. "తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలను పరిశీలిస్తే ఎలాంటి అర్హతలు లేకున్నా, కేవలం అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. కానీ మల్లంపల్లి ప్రాంతాన్ని మాత్రం ఎందుకు మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం లేదో ఎవరికి అర్థం కావడంలేదని" మల్లంపల్లి మండల సాధన కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాకే మణిహారంగా చెప్పుకునే ఎర్రమట్టి ఖనిజ సంపద మల్లంపల్లి ప్రాంతం సొంతం. అనేక పరిశ్రమలకు ఇక్కడి నుంచి ఖనిజ సంపద ఎగుమతి చేస్తుంటారు. అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ మల్లంపల్లి ప్రాంతాన్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

  మల్లంపల్లి మండల సాధన కమిటీ ఏర్పాటు: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 13 కొత్త మండలాల జాబితాలో మల్లంపల్లి ప్రాంతం పేరు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు గోల్కొండ రాజు అనే యువకుడి ఆధ్వర్యంలో మల్లంపల్లి మండల సాధన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా మల్లంపల్లి ప్రాంతాన్ని తప్పకుండా మండల కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని వారు అంటున్నారు. రాజకీయ నాయకులు కూడా వెంటనే తమ పార్టీలకు రాజీనామా చేసి తమతో పాటుగా ఉద్యమం చేయాలని ఈ కమిటీ పిలుపునిస్తుంది. మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

  సరిపోను ఎంపీటీసీ స్థానాలు లేకపోవడమే కారణమా: ఒక ప్రాంతాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే కనీసం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి. మల్లంపల్లి ప్రాంతానికి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి కాబట్టి మండల కేంద్రం ఏర్పాటు చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మిగిలిన రెండు ఎంపీటీసీ స్థానాలు కావాలంటే మల్లంపల్లికి సరిహద్దుగా ఉన్న ఇతర రెండు నియోజకవర్గాల నుంచి కొన్ని గ్రామాలను విలీనం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే నాయకులు అడుగులు వేస్తున్నప్పటికీ, గత 35 ఏళ్లుగా మల్లంపల్లిని మండల కేంద్రంగా చేయాలన్న తమ ఆకాంక్ష నెరవేరడం లేదని స్థానికులు అంటున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు