హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఉచితంగా కుట్టు మిషన్, శిక్షణ

Mulugu: మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఉచితంగా కుట్టు మిషన్, శిక్షణ

X
మహిళలకు

మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ

Mulugu: మహిళకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం వారికి వారు కాల మీద నిలబడే విధంగా సొంతంగా ఒక కుట్టు మిషన్ కూడా ఈ కేంద్రం అందిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(Venu Medipelly, News18, mulugu)

మహిళలు నేటి కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు స్వయం ఉపాధి రంగాలలోనూ మహిళలు తనదైన ముద్రను వేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా స్వయం ఉపాధి పైనే ఆసక్తి చూపిస్తున్నారు దీనిలో ఎక్కువగా కుట్టుమిషన్లపై అనేకమంది గ్రామీణ నగర ప్రాంతాల లాంటి మహిళలు ఆధారపడుతున్నారు ఎందుకంటే కుట్టు మిషన్లు నేర్చుకోవడం ద్వారా ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందవచ్చు...గత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కుట్టు మిషన్ల మార్కెటింగ్ చాలా తక్కువగా ఉండేది. కానీ నేటి పరిస్థితుల్లో ఆధునికత టెక్నాలజీ కూడా కుట్టుమిషన్లపై ప్రభావం చూపించింది.

అత్యాధునిక కుట్టుమిషన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటి సంపాదన కూడా అదే మార్గంలో ఉంటుంది... మగ్గం వర్క్స్ అని వెరైటీ డిజైన్లు ఇలా తీరొక బ్లౌజ్ కుట్టడం సారీస్ కుట్టడం ద్వారా అనేకమంది మహిళలు ఈ రంగంపై ఆధారపడి జీవనం కూడా కొనసాగిస్తున్నారు. మరి అలాంటి రంగంలో కొత్తవారు ఎలా ప్రవేశించాలి. ఎవరికి ఎవరు శిక్షణ ఇస్తారు అని దిగులు పడే వారికి ములుగు జిల్లాలోనీ న్యాక్స్ సెంటర్ భరోసానిస్తుంది...ఈ సెంటర్ ద్వారా దాదాపు 30 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించడం జరుగుతుంది.

పర్ణశాలపై ఇంత నిర్లక్ష్యమా..? పవిత్ర ప్రదేశాన్ని పట్టించుకోరా..?

అయితే నేటి పోటీ ప్రపంచంలో మార్కెట్లో కొత్తదనం ఉరకలు వేస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్‌కు అనుబంధంగా ఉండటంతో ఈ రంగంపై అనేకమంది మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటివారి కోసం 90 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది... ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం కల్పించి శిక్షణ అనంతరం వారికి వారు కాల మీద నిలబడే విధంగా సొంతంగా ఒక కుట్టు మిషన్ కూడా ఈ కేంద్రం అందిస్తుంది. దీని ద్వారా మహిళలు ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని ఈ కార్యక్రమం  ముఖ్య ఉద్దేశ్యంగా చెప్పుకోవచ్చు.

ఈ కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణను పొందుతున్న మహిళలతో న్యూస్ 18 ప్రతినిధి మాట్లాడడం జరిగింది. బయటి పనులకు వెళితే 200 రూపాయలు వస్తున్నాయి కానీ ఎండలో ఒళ్లంతా హూనం చేసుకొని పని చేయాలి. అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కానీ కుట్టు మిషన్ నేర్చుకుని ఇంట్లో కూర్చుని కుటుంబానికి సరిపడా ఖర్చులను సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్క బ్లౌజ్ పీస్ కుడితే రెండు నుంచి మూడు వేల మధ్యలో ఉంటుంది. అత్యధిక టెక్నాలజీ అన్ని వెరైటీలతో కూడిన శిక్షణను ఇక్కడ ఇస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు మాలాంటి నిరుపేద మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శిక్షణ పొందుతున్న మహిళలు చెప్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు