హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS leader arrest: వరంగల్​లో అధికార పార్టీకి షాక్​.. భూ కబ్జాలు, సెటిల్మెంట్ల కేసులో లీడర్​ అరెస్టు

TRS leader arrest: వరంగల్​లో అధికార పార్టీకి షాక్​.. భూ కబ్జాలు, సెటిల్మెంట్ల కేసులో లీడర్​ అరెస్టు

వరంగల్​

వరంగల్​

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నల్లబెల్లి మండల అధ్యక్షుడు సారంగపాణిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో భూ సెటిల్మెంట్లు చేస్తూ బాధితులను బెదిరిస్తున్న ఘటనలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (M. Venu, News18, Mulugu)

  తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నల్లబెల్లి మండల అధ్యక్షుడు సారంగపాణిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో భూ సెటిల్మెంట్లు (Land Settlements) చేస్తూ బాధితులను బెదిరిస్తున్న ఘటనలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం కోర్టులో (Court) హాజరు పరిచి పరకాల సబ్ జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలోకి వెళితే.. పైడిపల్లి, ఆరేపల్లి, కరీమాబాద్, బట్టుపల్లి, కేయూ ప్రాంతాలలో వివాదాస్పద భూముల పరిష్కారమంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

  ఇన్​స్పెక్టర్​పై విచారణతో కదిలిన డొంక..

  వీరిలో పోలీస్ డిపార్ట్మెంట్‌కి మచ్చ తెచ్చేలా రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ (Sampath Kumar) ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని పలువురుని బెదిరించి చివరికి కటకటాల పాలయ్యాడు. అదుపులో ఉన్న నిందితులను విచారించే క్రమంలో అధికార పార్టీకి చెందిన నల్లవెల్లి మండల అధ్యక్షుడు సారంగపాణి కూడా భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.యూనివర్సిటీ పోలీసులు రింగ్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంలో సారంగపాణిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. భూ సెటిల్మెంట్ల వివాదంలో నయీమ్ గ్యాంగ్లో పనిచేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పోలీస్ శాఖ నుంచి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంపత్ కూడా నిందితుడిగా ఉండటంతో ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

  తాజాగా అదుపులోకి తీసుకున్న అధికార పార్టీ మండల అధ్యక్షుడు సారంగపాణి, ఇంకొంతమంది ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు కూడా భూ తగాదాలు, నయీమ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసులను ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు...భూ సెటిల్మెంట్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారంతో పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు.

  Primitive man tombs: న్యూస్ 18 ఎఫెక్ట్: కదిలిన పర్యాటకశాఖ, ఆదిమ మానవ ప్రాంతాలకు గుర్తింపు 

  మొదటగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మరో ప్రధాన నిందితుడు ముద్దసాని వేణుగోపాల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Land mafia, Local News, Warangal

  ఉత్తమ కథలు