హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

X
ములుగు

ములుగు జిల్లాలో లంపీస్కిన్ కలకలం

మూగ జీవాలపైన ఒక కొత్త రకం వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది.అది లంపి స్కిన్ (Lampi Skin) అని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ పశువులపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. మొదటగా వేరే ప్రాంతాలలోమూగజీవాలపై ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపించినప్పటికీ తర్వాత కాలంలో తెలంగాణ (Telangana) లో అలాగే ములుగు (Mulugu District) లాంటి ప్రాంతాలలో కూడా వైరస్ వ్యాపిస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal | Telangana

Venu, News18, Mulugu

మూగ జీవాలపైన ఒక కొత్త రకం వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది.అది లంపి స్కిన్ (Lampi Skin) అని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ పశువులపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. మొదటగా వేరే ప్రాంతాలలోమూగజీవాలపై ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపించినప్పటికీ తర్వాత కాలంలో తెలంగాణ (Telangana) లో అలాగే ములుగు (Mulugu District) లాంటి ప్రాంతాలలో కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ మూగ జీవాలపైలంపి స్కిన్ వైరస్ చూపెట్టిన ప్రభావాన్ని రైతులలో ఆందోళన గురిచేస్తుంది. ఒళ్లంతా దద్దుర్లు లేచినట్టు బోడుప్పలు కట్టడం. పాల ఉత్పత్తి తగ్గడం. ఇవన్నీ చూసి రైతన్న కలరపడుతున్నాడు. ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో లంపి స్కిన్ వైరస్ వ్యాపించడంపై న్యూస్ 18 ప్రతినిధి... ములుగు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారితో మాట్లాడారు.

వైద్యులు చెబుతున్న దాని ప్రకారం లంపి స్కిన్ వైరస్ కొత్త వైరస్ ఏమి కాదు దీనిని మనం ముద్ద చర్మం వ్యాధిగా చెప్పుకుంటాం. ఈ వైరస్ వస్తే ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ వల్ల వేరే ప్రాంతాలలో మూగజీవాలు మరణించినప్పటికీ మనలాంటి ప్రాంతంలో మాత్రం ఒక్క మూగజీవి కూడా చనిపోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే మూగజీవాలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.ములుగు జిల్లాలో ఇప్పటివరకు 137 లంపి స్కిన్ కేసులు రావడం జరిగిందని వాటికి వైద్యం అందించి వ్యాధిని తగ్గించడం జరిగిందన్నారు.

ఇది చదవండి: బాడీబిల్డింగ్ లో దూసుకుపోతున్న సింగరేణి యువకుడు

జిల్లాలో ఇప్పటివరకు 40 వేల పశువులకు వ్యాక్సినేషన్ ఎల్ఎస్డి టీకాలు కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు. లంప్ స్కిన్ వ్యాధిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ కొరకు 27 టీములు ఏర్పాటు చేసి అన్ని పశువులకు వ్యాక్సినేషన్ చేస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. అలాగే ములుగు జిల్లాలో మందులకు ఎలాంటి కొరత లేదని... రైతులు అధైర్యపడవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇది చదవండి: నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు.., నిధి దొరికిందా..? పురాతన ఆలయాల వద్ద ఏం జరుగుతుంది..?

ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో తెలుసా ?

ముఖ్యంగా ఈ వ్యాధి సూక్ష్మతి సూక్ష్మ క్రిమి అయిన వైరస్ వల్ల సోకుతుందని, దోమలు, ఈగలు, గోమార్లు, బిరుదులు ఒంటి కీటకాల వలన వ్యాప్తి చెందుతుందని, గోజాతిలో ఎక్కువగా సోకుతుందని వైద్యులు చెప్తున్నారులంప్ స్కిన్ వ్యాధి సోకిన పశువులకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి...?ఈ వ్యాధి వచ్చిన పశువులకు రెండు మూడు రోజులు జ్వరం వస్తుంది. ఆకలి మందగిస్తుంది. గంగడోలు కాళ్ళ వాపు వస్తాయి. పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్స జాగ్రత్తలు తీసుకోవాలి...? లంపి స్కిన్ వ్యాధి సోకిన పశువులను వెంటనే మంద నుండి వేరు చేసి వెంటనే పశువుల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. వ్యాధి సోకకుండా పశువులకు గోట్ పాక్స్ టీకాలు వేయించాలి. కీటకాలు పెరగకుండా పొగ వేయాలి.

ప్రాణ నష్టం జరుగుతుందా..?

ఇప్పటివరకు ములుగు జిల్లాలో 130కి పైగా కేసులు నమోదైనప్పటికీ వ్యాధి సంక్రమించిన పశువులు మాత్రం చనిపోలేదు. వాటికి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య అధికారులు చెప్తున్నారు.వేరే రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి సోకిన పశువులు మృత్యువాతపడ్డప్పటికీ మనలాంటి ప్రాంతంలో మాత్రం ఒక్క మరణం కూడా సంభవించలేదని ఈ వ్యాధి విషయంలో రైతులు అధైర్యపడవద్దని... గ్రామాలలో అన్ని పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు