హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: జిల్లాలో ఖిలాడీ లేడీ దొంగలు.. తస్మాత్ జాగ్రత్త!

Mulugu: జిల్లాలో ఖిలాడీ లేడీ దొంగలు.. తస్మాత్ జాగ్రత్త!

X
ఖిలాడీ

ఖిలాడీ లేడీ దొంగలు

Telangana: ములుగు జిల్లా కేంద్రం నిత్యం ప్రజలతో బిజీబిజీగా ఉరుకుల పరుగుల జీవనంతో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రైమ్ కూడా అభివృద్ధి చెందుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి

లొకేషన్ : ములుగు

ములుగు జిల్లా కేంద్రం నిత్యం ప్రజలతో బిజీబిజీగా ఉరుకుల పరుగుల జీవనంతో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రైమ్ కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ ఒకప్పుడు ములుగు జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలో జరుగుతూ ఉండేది. క్రైమ్ రేట్ లో కూడా ములుగు జిల్లా అట్టడుగు స్థానంలో ఉండేది. కానీ ములుగు జిల్లాలో ఏకంగా మహిళలు దొంగతనాలకు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత మూడు రోజుల క్రితం ములుగు జిల్లాలో ద్విచక్ర వాహనంలో ఉన్న రెండు లక్షల ఎనభై వేల రూపాయలను గుర్తు తెలియని మహిళలు అపహరించారు. ఈ ఘటన ములుగు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఆ మధ్యకాలంలో దండుపాళ్యం, చెడ్డి గ్యాంగ్, పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ అని ఇలా వివిధ రకాలుగా అనేక పుకార్లు వచ్చినప్పటికీ వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవు కానీ ఈ దొంగతనం ఘటనతో ఒక్కసారిగా ములుగు ప్రాంతం ఉలిక్కిపడింది. ములుగు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగింది..

చీకటి మసకబారుతున్న వేళ ములుగు జిల్లా, ములుగు మండలం.. ఖాసిం దేవి పేట గ్రామ సర్పంచ్ గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించి సుమారు మూడు లక్షల రూపాయలను తన ద్విచక్ర వాహనంలో ఉంచుకున్నాడు. ములుగు కేంద్రంలోని అపోలో మెడికల్ షాప్ ముందు తన ద్విచక్ర వాహనాన్ని మార్పు చేసి అందులో నుంచి సుమారు 15 వేల రూపాయలను తీసుకొని దుకాణంలోకి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ద్విచక్ర వాహనంలో ఉండే డబ్బులు మాయమయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల 80 వేల రూపాయలు మాయం అయ్యేసరికి ఒక్కసారిగా సర్పంచ్ కి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు.. చేసేదేమీ లేక ములుగు పోలీసులకు సమాచారం అందించారు.

దుకాణం సీసీటీవీని పరిశీలించగా.. గుర్తుతెలియని ముగ్గురు మహిళలు రెండు లక్షల 80 వేల రూపాయలను దొంగిలించాలరాని అర్థమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుర్తు తెలియని మహిళల ఫోటోలను అన్ని వాట్సప్ గ్రూపుల ద్వారా అందరికీ సమాచారం అందించారు. ఈ ఫోటోలలో కనిపించే వ్యక్తులు ములుగు పట్టణంలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనంలోని రెండు లక్షల ఎనభై వేల రూపాయలను దొంగలించారని, సమాచారం అందిస్తే తగిన ప్రోత్సాహం అందిస్తామని ప్రకటన జారీ చేశారు.

ఇది ఇలా ఉండగా ములుగు లాంటి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? వారి నివాస ప్రాంతం ఎక్కడ ఉంది? అనే చర్చ మొదలైంది. ములుగు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 9440795229 సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు.

First published:

Tags: Crime news, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు