హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మేడారం మినీ జాతర పనులను పర్యవేక్షించిన ఐటీడీఏ పీవో

Mulugu: మేడారం మినీ జాతర పనులను పర్యవేక్షించిన ఐటీడీఏ పీవో

X
మినీ

మినీ జాతర ఏర్పాట్లు చూస్తున్న అధికారులు

Telangana: మేడారం మినీ జాతర ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి ప్రారంభం కానుంది. మినీ మేడారం జాతరకు లక్షల్లో భక్తులు వనదేవతలను దర్శించుకుంటారు. ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరాలకు సంబంధించిన చిన్న చిన్న జాతరలు ప్రారంభం అయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వేణు మేడిపెళ్లి

లొకేషన్ : మేడారం

మేడారం మినీ జాతర ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి ప్రారంభం కానుంది. మినీ మేడారం జాతరకు లక్షల్లో భక్తులు వనదేవతలను దర్శించుకుంటారు. ఇప్పటికే ములుగు జిల్లా వ్యాప్తంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరాలకు సంబంధించిన చిన్న చిన్న జాతరలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల వ్యవధి ఉండటంతో ఇప్పటి నుంచే మేడారం జాతరకు భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న సౌకర్యాలు అభివృద్ధి పనులను ఐటిడిఏ పీవో అంకిత ఐఏఎస్ దగ్గరుండి సమీక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఐటిడిఏ పీవోగా విధులు నిర్వర్తిస్తున్న అంకిత్ ఐఏఎస్ గతంలో ఐటిడిఏ ఉట్నూర్ పిఓగా పనిచేసిన అనుభవం ఉంది. ఉట్నూర్ పరిధిలో జరిగే కేస్లాపూర్ జాతరను అంకిత్ విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేసిన అనుభవం ఉంది.. ఆ అనుభవంతోనే మేడారం మినీ జాతర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, ఆటంకాలు లేకుండా విజయవంతం చేస్తానని అంకిత్ న్యూస్ 18తో చెప్పారు.

జాతర విజయవంతం కోసం అధికారులు భక్తులు అందరూ సహకరించాలని కోరారు. మేడారం మినీ జాతరకు సంబంధించి అధికారులు ఎక్కువగా పారిశుద్ధ్య, త్రాగునీరు, స్త్రీలు వస్త్రాలు మార్చుకునే గదులు, జంపన్న వాగు వద్ద నల్లాల ఏర్పాట్లు తదితర అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తి అయినట్లు చెప్తున్నారు.

మేడారం మినీ జాతర కాకుండా ఐలాపూర్ లో జరిగే జాతర కూడా విజయవంతం చేయాలని సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మేడం జాతరకు వచ్చే భక్తులు మేకలను, కోళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. వాటికి సంబంధించిన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వాటికి సంబంధించిన దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జంపన్న వాగు సమీపంలో వసతి గృహాలు భక్తుల కోసం పగిడింతరాజు భవన్, గోవిందరాజుల భవన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మినీ మేడారం జాతర విషయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ వారికి సూచించినటువంటి పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని చెప్తున్నారు. భక్తులు సుధీర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడం కోసం వస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. మేడం మినీ జాతర కాకుండా ఐలాపూర్ జాతరలోని పనులను కూడా ఐటీడీఏ పీవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

First published:

Tags: Local News, Medaram jatara, Mulugu, Telangana

ఉత్తమ కథలు