హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కేసీఆర్ ఎవరో చెప్పలేని స్థితిలో గురుకుల పాఠశాల విద్యార్ధులు .. ఎక్కడో..? ఈవీడియో చూడండి

Telangana: కేసీఆర్ ఎవరో చెప్పలేని స్థితిలో గురుకుల పాఠశాల విద్యార్ధులు .. ఎక్కడో..? ఈవీడియో చూడండి

(ITDA PO VISITING)

(ITDA PO VISITING)

Telangana: తెలంగాణలో ఇప్పటికి మారు మూల ప్రాంతాలు, గిరిజన, ఏజెన్సీ గ్రామాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోగా..పూర్తిగా మరుగునపడే పరిస్థితి కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీవోకు విద్యార్ధుల పరిజ్ఞానం చూసి అసహనానికి గురయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahabubabad, India

(P.Srinivas,New18,Karimnagar)

తెలంగాణ(Telangana)లోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్ధుల్లో పరిజ్ఞానం కొరవడుతోంది. అక్షరాస్యత శాతం పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఎమ్‌ఎల్‌ఎల్‌(MLL)(మినిమం లెర్నింగ్ లెవల్) సరైన రీతిలో విద్యార్థుల్లో పెంపొందించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండే దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మహబూబాబాద్ (Mahabubabad)జిల్లాలోని ఓ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల(Tribal Welfare Gurukula School)విద్యార్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో చూపించి ఈయన ఎవరూ అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Karthika masam 2022 | TS RTC: కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు .. ప్యాకేజీ డిటేయిల్స్ ఇవే

విజ్ఞానం, విద్యాలో వెనుకడుగే..

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికి మారు మూల ప్రాంతాలు, గిరిజన, ఏజెన్సీ గ్రామాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోగా..పూర్తిగా మరుగునపడే పరిస్థితి కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని సాదిరెడ్డిపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలని ఐటీడీఏ పీఓ అంకిత్ ఆకస్మికంగా సందర్శించారు. అదే సమయంలో అక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీచర్లు ఎలాంటి బోధన అందిస్తున్నారు. వాళ్లలో ఏ మేరకు విద్యా పరిజ్ఞానం ఉందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఓ స్టూడెంట్‌ని పాఠ్య పుస్తకాలపై ముద్రించిన రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఫోటోతో పాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఫోటోలు చూపించి వీళ్లు ఎవరని అడిగారు. పీఏ అంకిత్ అడిగిన ప్రశ్నకు విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు. పాఠ్య పుస్తకాలపై ఉన్న సీఎం, మంత్రినే విద్యార్ధులు గుర్తించలేని స్థితిలో ఉండటంతో ఒకింత అసహనానికి గురయ్యారు. అక్కడ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులను పిలిచారు. పిల్లల్లో నైపుణ్యంతో పాటు కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలని సూచించారు ఐటీడీఏ పీఓ అంకిత్.

మొక్కుబడిగా పని చేస్తున్న టీచర్లు..

కొత్తగూడ మండలంలో పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లలు చదువుకు దూరం కావొద్దని లక్షలు వెచ్చిస్తూ గురుకులాల నిర్వహణను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వ జీతం తీసుకుంటున్న కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధులకు పాఠాలు చెప్పడం, కనీస పరిజ్ఞానం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దాని ఫలితంగానే ఏజెన్సీలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో అనుకున్న మేర విద్యా బోధన జరగట్లేదు. విషయ పరిజ్ఞానం, జ్ఞాపక శక్తి విద్యార్థుల్లో కొరవడుతోంది. నాణ్యత గల విద్యా బోధన నానాటికీ కరువవుతోంది. జీతం కోసం పని చేస్తున్నారే తప్ప విద్యార్ధుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కాదనే విమర్శలు వస్తున్నాయి.

మార్పు అవసరం..

ఉపాధ్యాయుల బోధన తీరులో అనుకూల మార్పు రావట్లేదు. విద్యార్థులు పదాలను స్పష్టంగా గుర్తించడం, అనర్గళంగా చదవడం, చూడకుండా రాయడం, సులభ రీతిలో గణన చేయడం లాంటి కనీస సామర్థ్యాలను విద్యార్థులకు నేర్పించకపోవడం వల్లే ఈ పరిస్థితికి వచ్చిందంటున్నారు స్థానికులు. ఇలాంటి కారణాల వల్లే పేద తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని చదివించుకోవడానికి ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారు. ఇప్పటికైనా ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు విద్యాబోధనలో తమ విధానాలు మార్చుకోవాలని లేని పక్షంలో భవిష్యత్ తరాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Mahabubabad, Telangana News

ఉత్తమ కథలు