Home /News /telangana /

MULUGU INTERSTATE GOLD THIEF ARRESTED BY WARANGALA CRIME BRANCH POLICE BRV MMV ABH

Mulugu: మీ బంగారం వారి కంట్లో పడిందా అంతే సంగతులు.. బంగారం చోరీల్లో ఆరితేరిన ముఠా అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఖాకీ సినిమాను తలపించిన  సంఘటన

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఖాకీ సినిమాను తలపించిన  సంఘటన

మీరు ఫోటోలో చూస్తున్న బంగారం ఏదో నగల షాప్‌లో కొనుగోలుకు పెట్టిన బంగారం అనుకుంటే పొరపాటే. ఆ బంగారం ఒక అంతరాష్ట్ర దొంగల ముఠా పలు సందర్భాల్లో చోరీ చేసిన మొత్తం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆ ముఠా ఎంత బంగారం చోరీ చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India
  (M.Venu, News 18, Mulugu)

  మీరు ఫోటోలో చూస్తున్న బంగారం ఏదో నగల షాప్‌లో కొనుగోలుకు పెట్టిన బంగారం అనుకుంటే పొరపాటే. ఆ బంగారం ఒక అంతరాష్ట్ర దొంగల ముఠా పలు సందర్భాల్లో చోరీ చేసిన మొత్తం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆ ముఠా ఎంత బంగారం చోరీ చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. జిల్లలో జరిగిన మొత్తం పది చోరీ ఘటనల్లో వీరు దోచుకున్న బంగారం విలువ రూ. 50 లక్షల పై మాటే. విడతల వారిగా వరంగల్ పరిధిలో ఈ ముఠా చేస్తున్న చోరీలకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అడ్డుకట్ట వేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుల వివరాలు:
  1) పరమేందర్ సింగ్ S/o రమేశ్ సింగ్, వయసు 28 సం:రాలు, కులము: రాజపుత్, R/O, భానర్, బివాని జిల్లా, హర్యాన రాష్ట్రం.
  పరారీలో ఉన్న నిందితుల వివరాలు
  2) సాదు R/O ఛాన్షర్, బివాని జిల్లా, బివాని జిల్లా, హర్యాన రాష్ట్రం.
  3) పవన్ R/o ఛాన్దర్, బివాని జిల్లా, హర్యాన రాష్ట్రం.

  దొంగతనాలను ఎంచుకున్నతీరు:
  ఈ ముగ్గురు హర్యానా రాష్ట్రంలో స్నేహితులు. జల్సాలకు, మద్యంకు బానిసయ్యారు. జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలకు పాల్పడ్డారు. వేర్వేరు రాష్ట్రాలు తిరుగుతూ ఖరీదైన గృహాలను, తాళాలు వేసి ఉన్న గృహాలను టార్గెట్ చేసిచోరీలకు పాల్పడేవారు. ఈ ముగ్గురు మొదటగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, వడోదర మరియు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అరండల్‌పేట్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈక్రమంలో అహ్మదాబాద్ పోలీసులకు చిక్కారు. 9 నెలలు జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చిన నిందితులు మళ్లీ జల్సాల కోసం చోరీలకు పాల్పడ్డారు. అయితే సొంత రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేస్తే మళ్లీ పోలీసులు గుర్తుపడతారనే భయంతో ఈసారి రాష్ట్రాన్ని మార్చారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో దొంగతనాలు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. 2021లోనే ఈ ముగ్గురు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేటలో రెండు దొంగతనాలు చేసి, అనంతరం మూడు నెలలు విరామం ఇచ్చి మరల వరంగల్ హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు, మత్వాడ పోలీస్ పరిధిలో ఒక దొంగతనం మొత్తం ఐదు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు.

  రంగంలోకి దిగిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు:
  చోరీలు జరుగుతున్న తీరును జాగ్రత్తగా పరిశీలించిన పోలీసులు రంగంలోకి దిగి సరైన ఆధారాల కోసం వెతికారు. దొంగతనం జరిగిన ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన క్లూస్ టీం నిందితుల వేలిముద్రలు సేకరించారు. సేకరించిన వేలిముద్రలు గతంలో అరెస్ట్ అయిన నిందితులతో పోలి ఉంటాయా అనే అంశంలో వరంగల్ పోలీసులు ఇతర పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. వరంగల్లో క్లూస్ టీం సేకరించిన వేలిముద్రలు గుంటూరులోని అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టైన పరమేందర్ సింగ్ అనే నిందితుడితో సరిపోవడంతో ఇక్కడ కూడా దొంగతనాలు చేసింది పరమేందర్ సింగ్ అనే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ చోరీ ఘటనలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరుణ్ జోషి ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి శాస్త్ర సాంకేతిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తూ పలుమార్లు ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా తదిత ప్రాంతాలకు వెళ్లి నిందితుల గురించి ఆరా తీసి వారిపై నిఘా ఉంచారు.

  ఇదే గ్యాంగ్ మళ్లీ 2022లో: మళ్లీ ఇదే గ్యాంగ్ ఈ ఏడాది రెండు కార్లలో వరంగల్ వచ్చారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేశారు. అలాగే సూర్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు. వరంగల్ లో సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు డిసిపి అశోక్ కుమార్ అడిషనల్ డీసీపీ కె పుష్ప  పర్యవేక్షణలో తనిఖీలు మొదలుపెట్టారు. హనుమకొండ పెద్దమ్మగడ్డ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో ప్రయాణిస్తున్న నిందితులను పోలీసులు నిలువైరులు. ఈక్రమంలో ముగ్గురిలో పరమేందర్ సింగ్ మాత్రమే పోలీసులకు పట్టుబడ్డాడు. .మిగతా ఇద్దరు నిధితులు కారు వదిలి పారిపోయారు. పరమేందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి అతని నుంచి రూ. 52 లక్షలు విలువైన ఒక కిలో 33 గ్రాముల బంగారం, దొంగతనానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Mulugu, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు