Home /News /telangana /

MULUGU INCREASING DEMAND FOR ELECTRIC TWO WHEELERS IN MULUGU DISTRICT MMV ABH BRV

Mulugu: పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విసుగెత్తుతున్న వాహనదారులు.. మారుమూల ఏజెన్సీల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల జోరు

ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు

రూ. 5లతో 120 కిలోమీటర్ల ప్రయాణం. సాధారణంగా ప్రైవేటు వాహనం, ఆర్టీసీ బస్సు, లేద సొంత వాహనంలో 120 కిలోమీటర్లు ప్రయాణించాలంటే కనీసం రూ. 200 ఖర్చు అవుతుంది. కానీ కేవలం రూ. 5లతో 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చంటే కేవలం ఎలక్ట్రిక్ వాహనంపైనే సాధ్యమని చెప్పాలి.

ఇంకా చదవండి ...
    (M.Venu, News 18, Mulugu)

    రూ. 5లతో 120 కిలోమీటర్ల ప్రయాణం. సాధారణంగా ప్రైవేటు వాహనం, ఆర్టీసీ బస్సు, లేద సొంత వాహనంలో 120 కిలోమీటర్లు ప్రయాణించాలంటే కనీసం రూ. 200 ఖర్చు అవుతుంది. కానీ కేవలం రూ. 5లతో  120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చంటే కేవలం ఎలక్ట్రిక్ వాహనంపైనే సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే రూ. 5 విద్యుత్ ఖర్చుతో విద్యుత్ ద్విచక్రవాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మహా నగరాలు, పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని వాహనదారులు సైతం విద్యుత్ ద్విచక్రవాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

    ములుగు ఏజెన్సీలో విద్యుత్ వాహనాలు:
    ములుగు జిల్లా ఏర్పాటు కాకముందు ఒకటి రెండు ప్రైవేటు కంపెనీల ద్విచక్ర వాహనాలకు సంబంధించి షోరూంలో ఉండేవి. కానీ జిల్లా ఏర్పడిన అనంతరం అన్ని రకాల కంపెనీల ద్విచక్ర వాహనాలకు సంబంధించిన షోరూమ్స్ ములుగులో ఏర్పాటు చేశారు. పెట్రోల్ ద్విచక్ర వాహనాలకు దీటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొదటిసారిగా ములుగు ప్రాంతంలో ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభించారు. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో వాహనదారులకు ఇంధన భారం భరించలేనంత బాధగా మారింది. అయినా మనిషి జీవన చక్రంలో వాహనం ఒక భాగంగా మారిపోయింది. కాబట్టి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకినా కూడా సామాన్య మానవుడు భరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన ఆదరణ ఉంది. కానీ ములుగు వంటి ఏజెన్సీ ఏరియాలో విద్యుత్ వాహనాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఆ వాహనాలు చేరేందుకు కాస్త సమయం పట్టింది.

    2018లో మొదటి ఎలక్ట్రిక్ షోరూమ్:

    ములుగు జిల్లా ఏర్పాటు కాకముందే ములుగు జిల్లాకు చెందిన రఘువీర్ అనే వ్యక్తి పూజ ఎలక్ట్రిక్ బైక్ షోరూం ద్వారా ములుగు జిల్లాకు ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం ఒక యూనిట్ కరెంటుతో ఎలక్ట్రిక్ వాహనం చార్జింగ్ పెడితే దాదాపు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వాహనాలను స్థానిక వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాడు రఘువీర్. ఎలక్ట్రిక్ వాహనాలలో తక్కువ వేగంతోనూ, ఎక్కువ వేగంతోనూ నడిచే వాహనాలు ఉంటాయి. తక్కువ వేగంతో నడిచే వాహనాలకు ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్, హెల్మెట్, తదితర అంశాలు వర్తించవు. ప్రస్తుతం మహిళా ఉద్యోగినిలు, సాధారణ గృహిణిలు, విద్యార్థినిలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు రఘువీర్ తెలిపారు. ములుగులో తమ ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభించిన మూడు సంవత్సరాల వ్యవధిలోనే 300 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు.

    ఒకసారి చార్జింగ్ పెడితే 120 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఫుల్ చార్జింగ్ చేయాలంటే 5 గంటల సమయం పడుతుంది. ఇలాంటి వాహనాల ద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. Go Green - Go EV అనే విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ములుగులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం నంబర్: 6304276929
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు