Venu, News18, Mulugu.
ఉన్నత చదువులు చదివి పారిశ్రామిక రంగంలో రాణించాలి స్థిరపడాలి అనుకునే యువతకు ఇదొక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం మీకోసమే....ఏమిటి పథకం ఎలాంటి అర్హతలు ఉండాలి యువతకు ఎలాంటి సబ్సిడీ అందిస్తుంది ఎలాంటి వ్యాపారాలకు ఈ పథకం వర్తిస్తుంది మరెన్నో సందేహాలకు న్యూస్ 18 వివరణ ఇస్తుంది.
ఉన్నత విద్యనభ్యసించి పారిశ్రామిక రంగంలో రాణించాలనే యువతకు చేయూతనిస్తోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం (పీఎంఈజీపీ). గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకం కోసం జిల్లా పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ), ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు (కేవీఐబీ) సంయుక్తంగా అమలుకు పని చేస్తున్నాయి. యువతకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తూ పారిశ్రామిక, సేవా రంగాల్లో బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసి యువతకు తోడ్పాటు అందిస్తోంది.
అర్హతలు.. రాయితీలు ఇలా ఉన్నాయి ...
ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.. తయారీ రంగ పరి శ్రమలకు రూ. 50 లక్షల లోపు,
సేవా రూ.20 లక్షల లోపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ. ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు 5 శాతం, జనరల్ అభ్యర్థులు 10 శాతం తొలుత పెట్టుబడి వ్యయంగా చెల్లించాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో జనరల్ అభ్యర్థులకు 25, పట్టణ ప్రాంతాల్లో 15, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళల అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో 35, పట్టణ ప్రాంతాల్లో 25 శాతం రాయితీలను అందజేస్తారు. బ్యాంకు నుంచి యూనిట్ వ్యయంలో 50 శాతం మంజూరు చేస్తే నిర్ణీత సమయంలో కేవీఐసీ నుంచి రాయితీ వస్తుంది.
పీఎంఈజీపీ పథకం ద్వారా రుణాలు : వ్యవసాయం, సేవలు, మినరల్ వాటర్, నిర్మాణ రంగ, ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు ఆదరణ బాగుంది. జిల్లాలో అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలు రుణాన్ని 3 నుంచి 7 ఏళ్ల లోపు లబ్ధిదారుడు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా పరిశ్రమల శాఖ, కేవీఐసీ, కేవీఐబీ అధికారులు సంయుక్తంగా పీఎంఈజీపీ పథకంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
వివిద రకాల కంపెనీల సహకారంతో అవగాహన. లబ్ధిదారులు మూడేళ్ల పాటు యూనిట్ నడపలేకపోతే రాయితీ రద్దు చేసే అవకాశం ఉంది. బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. రానున్న రోజుల్లో PMEGP కి మరింత ఆదరణ పెరిగేందుకు వీలుంది. ఈ ఆర్దిక సంవత్సరంలో 100 మంది నిరుద్యోగ యువతకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు “మోడల్ సి.య.స్సీ డిజిటల్ సేవా కేంద్రాలకు” అనుమతులు మంజూరీ చేస్తున్నారు.
ఈ పథకం ఇతర విషయాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం,ములుగు జిల్లా వారి అద్వర్యంలో అవగహన సదస్సును ఏర్పాటు చేస్తున్నారు ....
స్థలం: రైతు వేదిక,వాజేడు (గ్రామం&మండలం),ములుగు జిల్లా తేది:25.11.2022
ఉదయం :10.00 గం నుండి 01.00 గం వరకు
G.శ్రీనివాస్ జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ
ములుగు జిల్లా సెల్ నెంబర్: 984802177
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana