హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu : పోలీస్ అభ్యర్థులకు అండగా ఐఏఎస్ అధికారి అంకిత్..!

Mulugu : పోలీస్ అభ్యర్థులకు అండగా ఐఏఎస్ అధికారి అంకిత్..!

పోలీస్ అభ్యర్థులకు అండగా..!

పోలీస్ అభ్యర్థులకు అండగా..!

Telangana: గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలుస్తున్న ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్.. గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల డబ్బులను వెచ్చించి సరియైన కోచింగ్ను తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు కూడా వారికంటూ ఉద్యోగం సాధించాలని జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కలలు కంటూ ఉంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలుస్తున్న ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్..

గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల డబ్బులను వెచ్చించి సరియైన కోచింగ్ను తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు కూడా వారికంటూ ఉద్యోగం సాధించాలని జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కలలు కంటూ ఉంటారు. వారి కలల కోసం వారు నిరంతరం శ్రమించినప్పటికీ కనీసం ప్రోత్సాహం లేకపోవడంతో నిరాశ చెందుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాల భర్తీని భారీ సంఖ్యలో చేపడుతుంది.

ఈ నేపథ్యంలోనే చాలామంది యువతి యువకులకు పోలీస్ జాబ్ ఒక లైఫ్ అచీవ్మెంట్ గా పరిగణిస్తారు.అలాంటి కష్టపడి లైఫ్ అచీవ్మెంట్స్ కోసం తాపత్రయ పడే గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఐటీడీఏ ఏటూర్ నాగారం అండగా నిలబడుతుంది.. వారికి బాసటగా నిలుస్తుంది.. తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం పోలీసు ప్రాథమిక పరీక్ష కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించడం జరిగింది. అనంతరం జరగబోయే ఫిజికల్ ఈవెంట్స్ విభాగంలో కూడా గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ శిక్షణను ఐటిడిఏ అధికారుల ఆధ్వర్యంలో పకడ్బందీగా జరుగుతుంది.

170 మందికి షూస్ అందజేసిన అంకిత్ ఐఏఎస్ నుంచి జరగబోయే ఫిజికల్ ఈవెంట్స్ విషయంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ జాకారం కేంద్రంగా 150 మంది గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ ఐఏఎస్ అభ్యర్థుల అందరికీ రన్నింగ్ షూస్ ను అందజేసి మరొకసారి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.

ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ మాట్లాడుతూ.. గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కష్టపడి ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణత సాధించారు. మరింత కష్టపడి గ్రౌండ్లో ఫిజికల్ ఈవెంట్స్ కూడా పాస్ అయి అనంతరం మెయిన్స్ పై దృష్టి పెట్టాలని జీవితంలో అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుదలతో శ్రమించాలని అభ్యర్థులకు సూచించాడు.

ఐటిడిఏ నిరంతరం గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు అండగా నిలుస్తుందని ఎవరు అధైర్య పడద్దని ఎలాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని చెప్తున్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులందరూ వారి వారి ఫిజికల్ ఈవెంట్స్ లలో తప్పకుండా మెరిట్ మార్కులు సాధించేలా కష్టపడాలని అనుకున్న ఉద్యోగాన్ని సాధించి తీరాలని త్వరలో జరగబోయే ఫిజికల్ ఈవెంట్స్ అందరికీ ముందస్తుగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.

First published:

Tags: Local News, Mulugu, Police jobs, Telangana

ఉత్తమ కథలు