హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganja Smuggling: ఒకే రోజు రెండు చోట్ల గంజాయి స్వాధీనం: అందరూ అక్కడి నుంచే తెస్తున్నారు

Ganja Smuggling: ఒకే రోజు రెండు చోట్ల గంజాయి స్వాధీనం: అందరూ అక్కడి నుంచే తెస్తున్నారు

గంజాయి స్మగ్లింగ్​

గంజాయి స్మగ్లింగ్​

డెలివరీ బాయ్ నుంచి మత్తు పదార్ధాల డెలివరీకి అలవాటు పడ్డాడు ఆ యువకుడు. డబ్బులు సంపాదించేందుకు మాదకద్రవ్యాల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. తనతో పాటు మరో ఇద్దరినీ కలుపుకుని గంజాయి రవాణాకు ఎత్తువేశారు. ఇంతలోనే పోలీసులు ఆ ఎత్తును చిత్తుచేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  డెలివరీ బాయ్ (Delivery) నుంచి మత్తు పదార్ధాల (Intoxicants) డెలివరీకి అలవాటు పడ్డాడు ఆ యువకుడు. తనతో పాటు మరో ఇద్దరినీ కలుపుకుని గంజాయి (Ganja) రవాణాకు (Transport) ఎత్తువేశారు. ఇంతలోనే పోలీసులు ఆ ఎత్తును చిత్తుచేశారు. మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాకు చెందిన అజయ్ కుమార్ గతంలోనే ఒక కేసు విషయంలో జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం హైదరాబాదులో (Hyderabad) డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. డబ్బులు సంపాదించేందుకు మాదకద్రవ్యాల వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. ఇతనికి తోడుగా అతని సోదరుడు భూక్య రమేష్ మరియు గుగులోతు కళ్యాణ్ కూడా చేయి కలిపారు. గంజాయి (Marijuana) రవాణా ద్వారా అధిక డబ్బులు వస్తాయని ఆశతో ఆంధ్రప్రదేశ్ - ఒడిస్సా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి వయా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు (Maharashtra) తరలించాలనుకున్నారు. ఈక్రమంలో ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో సిఆర్పిఎఫ్ (CRPF) సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనం అనుమానాస్పదంగా కనిపించింది.

  దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 17 బస్తాలలో దాదాపు 105 కేజీల గంజాయి లభ్యమైంది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా కారు డ్రైవర్ అజయ్ కుమార్ తో పాటు భూక్య రమేష్, గుగులోత్ కళ్యాణ్ ఈ గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

  కోటి రూపాయల గంజాయి: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా కలకలం సృష్టిస్తుంది. పోలీసులు అక్రమ రవాణాలను అడ్డుకుంటున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లలో ఎలాంటి చలనం లేదు. వరంగల్ జిల్లా పరిధిలోని నర్సంపేట కేంద్రంగా పోలీసులు 500 కిలోలకు పైగానే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన నర్సింహారావు ఖమ్మం జిల్లా బూర్గంపాడుకు చెందిన కన్నడ దుర్గ ప్రసాద్ కలిసి ఒడిస్సా రాష్ట్రంలో గంజాయిని కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలో విక్రయించేవారు. వీరికి ఇదే వ్యాపారంగా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 550 కిలోల గంజాయిని కొనుగోలు చేసి వాటిని రెండు కిలోలకు ఒక్కో ప్యాకెట్‌గా ప్యాకింగ్ చేసి దాదాపు 250కి పైగా ప్యాకెట్లను ఐచర్ వాహనంలో హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలో విక్రయించేందుకు తీసుకువెళుతున్నారు.

  పక్కా సమాచారం అందుకున్న ఖానాపూర్ పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా డీసీఎం కింది భాగంలో 250 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రవాణా విషయంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రధాన నిందితుడైన నరసింహారావు పరారీలో ఉన్నట్లు మిగతా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయల పైనే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ganja smuggling, Local News, Mulugu

  ఉత్తమ కథలు