Home /News /telangana /

MULUGU HOUSBAND SELF KILLED AFTER MURDERING WIFE ON ILLATION IN MULUGU DISTRICT ABH BRV MMV

Mulugu: చూడచక్కనైన జంట అనుకున్నారు.. కానీ అతడి కళ్లలో ఉన్న దాన్ని గుర్తించలేకపోయారు.. పాపం ఆ అమ్మాయి...

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

అనుమానమే పెనుభూతమైన వేళ కట్టుకున్న భార్యనే కడతేర్చాడు భర్త. ఈ ఘటన వరంగల్ సమీపంలోని ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్‌కు చెందిన తాళ్ల హరీష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు

    ( M.Venu, News 18, Mulugu)

    అనుమానమే పెనుభూతమైన వేళ కట్టుకున్న భార్యనే కడతేర్చాడు భర్త. ఈ ఘటన వరంగల్ సమీపంలోని ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్‌కు చెందిన తాళ్ల హరీష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బంధువులు ఉండటంతో అల్లూరి జిల్లా ఎటపాక మండలం గౌరీపేట గ్రామానికి చెందిన మాల్యాల గౌరీతో నెలన్నర క్రితమే వివాహం జరిగింది.

    రాష్ట్రాలు వేరైనప్పటికీ ఇద్దరు ఇష్టంతోనే వివాహం చేసుకున్నారు. ఈక్రమంలో పెళ్ళైన నెల రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్నాడు హరీష్. దీంతో రోజు భార్యను హింసించడంతో, గౌరీ పది రోజుల క్రితం తన పుట్టింటి వాళ్లకు సమాచారం ఇచ్చింది. దీంతో గౌరీ బంధువులు ఆత్మకూర్ వచ్చి హరీష్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో జరిగిన గొడవ గురించి గౌరీ తన పుట్టింటికి వాళ్లకు చెప్పిందన్న కోపంతో హరీష్ మరోసారి గొడవపడ్డాడు.

    దీంతో ఎలా అయినా భార్యను అంతముందించాలని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు హరీష్. రాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న తన భార్య మెడపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి హరీష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పరకాల ఏసిపి శివరామయ్య, ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ సిఐ గణేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు