(Venu Medipelly, News18, Mulugu)
మావోయిస్టు వారోత్సవాలు (Maoist celebrations) జరుపుతున్న వేళ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో సానుభూతిపరుడు అరెస్ట్ (Arrest) కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏజెన్సీలో పోలీసులు స్పెషల్ పార్టీ బలగాలతో అడవి (Forest) మొత్తం జల్లెడ పడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల వారోత్సవాలు ప్రతి గ్రామంలో జరుపుతామని మావోలు కరపత్రాలను కూడా విడుదల చేయడంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పోలీసులను చూసి ..
భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో రేగొండ సమీపంలో ఎస్ఎస్ శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర పోలీసులు గ్రామ శివారులలో తనిఖీలు (Search) నిర్వహించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అతని సిబ్బంది వెంబడించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని గాంధీనగర్‌కు చెందిన మావోయిస్టు సానుభూతి పరుడు రాజయ్య (Rajaiah) గా పోలీసులు గుర్తించారు.
నరిగే రాజయ్య తమ్ముడు నరిగే ఓంకార్ (Omkar) అలియాస్ ప్రకాష్ (Prakash)... మావోయిస్టులతో పనిచేస్తూ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అప్పటి నుంచి రాజయ్య (Rajaiah) కూడా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం మావోయిస్టు అగ్రనేత దామోదర్‌ను కూడా రాజయ్య కలిశాడట. మావోయిస్టు అధినేతగా ఉన్న దామోదర్ మావోయిస్టు దళ సభ్యుడైన కొమ్మల నరేష్‌కి తుపాకీ ఇచ్చాడు.
వాజేడు ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నరేష్ మృతి చెందగా. .అగ్ర నాయకుడు దామోదర్ ఆదేశాల మేరకు పరకాలలో వ్యాపారస్తులను తుపాకీతో బెదిరించి మావోయిస్టు పార్టీ ఫండ్ కోసం డబ్బులు వసూలు చేయాలని ఆదేశించారట. ఈ నేపథ్యంలోనే రాజయ్య తుపాకీ, కరపత్రాలతో బైక్ పై పరకాల బయలుదేరి పోలీసులకు పట్టుబడ్డాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Maoist, Mulugu