హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tigers: అడవిలో పెద్దపులి సంచారాన్ని ఎలా గుర్తిస్తారు..? అధికారులు ఫాలో అయ్యే రూల్స్ ఇవే..!

Tigers: అడవిలో పెద్దపులి సంచారాన్ని ఎలా గుర్తిస్తారు..? అధికారులు ఫాలో అయ్యే రూల్స్ ఇవే..!

ములుగులో

ములుగులో పులుల సంచారం

Mulugu: పెద్ద పులి సంచారాన్ని ఏ విధంగా గుర్తిస్తారు? పులి అడవిలో సంచరిస్తున్నప్పుడు దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది? పులి ఎదురైనప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి? అనే అంశాలపై అధికారులు వివరించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  Venu, News18, Mulugu


  తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా పెద్దపులులు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana) లోని భూపాల్ పల్లి - ములుగు జిల్లా (Mulugu District) సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి (Tiger) సంచరిస్తోంది. భూపాలపల్లి జిల్లా (Bhupalapalli District) పలిమెల మండలంలో పెద్దపులి సంచారం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పలిమెల మండలం ముకునూరు కృష్ణాపురం అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో రోడ్డుపై పులి కనిపించడంతో పాటు పశువులపై దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో కృష్ణాపురం అటవీ ప్రాంతంలో పులి పాద ముద్రలు కనుగొన్న ఫారెస్ట్ సిబ్బంది ఇక్కడ పులి సంచారాన్ని నిర్ధారించారు.


  భూపాలపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులతో పాటు న్యూస్ 18 ప్రతినిధి అటవీ ప్రాంతంలోకి వెళ్లి పులి జాడను కనిపెట్టే ప్రయత్నం చేశారు. అసలు పెద్ద పులి సంచారాన్ని ఏ విధంగా గుర్తిస్తారు? పులి అడవిలో సంచరిస్తున్నప్పుడు దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది? పులి ఎదురైనప్పుడు మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి? అనే అంశాలపై అధికారులు వివరించారు.


  ఇది చదవండి: ఒకప్పుడు పచ్చని తోరణాలతో కళకళలాడిన దేవాలయం.., ఇప్పుడు పచ్చని చెట్టు కిందకు మారింది..


  భూపాలపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారి భూక్య లావణ్య ఐఎఫ్ఎస్ న్యూస్ 18తో మాట్లాడుతూ "గత ఏడాది నుంచి భూపాలపల్లి అటవీ సరిహద్దు ప్రాంతంలో టైగర్ మూమెంట్ తరచు ఉంటుంది... మా అంచనా ప్రకారం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి భూపాలపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి నది ప్రవాహం నేపథ్యంలో టైగర్ ఎక్కువగా మన అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందని" వివరించారు. భూపాలపల్లి జిల్లా కాటారం రేంజ్ ఆఫీసర్ స్వాతి మాట్లాడుతూ అడవిలో సంచరించే పులి ఏ విధంగా ప్రవర్తిస్తుందో వివరించారు. టైగర్ మూమెంట్ ఏ విధంగా గుర్తించాలని అనే విషయాలను కూడా పంచుకున్నారు.


  ఇది చదవండి: రాజన్న ధర్మగుండానికి మోక్షం ఎప్పుడు?: సహనం కోల్పోతున్న భక్తులు


  పులి సంచరించే సమాచారం ఎలా వస్తుంది.?
  మొదటగా పులి సంచరిస్తుందనే విషయం పశువుల కాపరుల ద్వారా లేదా ఫారెస్ట్ వాచర్స్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారులు బృందాలుగా విడిపోయి పులి అడుగు జాడల కోసం వెతకడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా నీరు ఉండే ప్రాంతాల్లో పులి సంచరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాగుల వెంట ఫారెస్ట్ అధికారులు పులి అడుగుజాడలను పరిశీలించే ప్రయత్నం చేస్తారు.


  ఇది చదవండి: మనం మొక్కే ఆ వినాయకుడు ఈ చేతుల సృష్టే..! కానీ వారి పరిస్థితి మాత్రం..!


  అడవిలో పులి ప్రవర్తన ఎలా ఉంటుంది.?

  అడవిలో పులి సంచరిస్తుందంటే అడవి చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం. పులి సంచరించే అడవి చాలా భీకరంగా, దట్టంగా కనిపిస్తుంది. పులి ముఖ్యంగా దాడి చేసే విషయంలో మాటు వేసి పంజా విసురుతుంది. ముఖ్యంగా పొదల చాటు నుంచి పులి దాడి చేయడం జరుగుతుంది. అలాగే పులి వెంటాడి వేటాడి చంపడం చాలా ఇష్టపడుతుంది. కాబట్టి అడవిలో ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో పులి ఎదురైతే మొట్టమొదటగా మనిషి పులి కళ్ళలోకి చూడకూడదు. భయంతో పరుగు తీయకూడదు. మెల్లిగా చూపు వేరే దిక్కు చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ పెద్దపెద్ద శబ్దాలు చేయాలి. ఆ శబ్దాలు విని పులి పారిపోవడం జరుగుతుంది.  టైగర్ జోన్‌గా మార్చే అవకాశం ఉంటుందా.?

  ఇప్పటివరకు ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గానే ఉంది. పులులు మాత్రం నివాసం ఏర్పరచుకుంటే ఈ ఫారెస్ట్‌ను టైగర్ జోన్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ టైగర్ జోన్‌గా ప్రకటిస్తే కొన్ని నియమనిబంధనలను పాటించాలి. ముఖ్యంగా ములుగు ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో పులి నివాసం ఏర్పరచుకోవాలంటే దానికి సరిపడా ఆహారం లభించాలి. సమృద్ధిగా ఆహారం లభించినప్పుడే పులి తన ఆవాసాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. పులి సంచరించే విషయంలో అటవీ సరిహద్దు ప్రాంతంలో ఉండే గ్రామాలు గాని పశువుల కాపరులు గాని జాగ్రత్తగా ఉండాలి. పులులకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Mulugu, Telangana, Tigers

  ఉత్తమ కథలు