(Venu Medipelly, News18, mulugu)
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభా మేళా నాలుకైదు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తజన సందోహం, వనం మొత్తం జనంతో నిండిన వేళ జాతర సమయంలో మేడారం ప్రాంతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. అలాంటి మేడారం జాతర హుండీ లెక్కింపు మీరు ఎప్పుడైనా చూశారా... జాతర హుండీ ఆదాయం ఎంత ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు..హుండీ లెక్కించడానికి సేవకులు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా. ఇవన్నీ వివరాలు చూపించే ప్రయత్నం న్యూస్ 18 మీకు చేస్తుంది.
2020 సంవత్సరంలో జరిగిన జాతర హుండీ ఆదాయం11 కోట్ల పై మాటే... బంగారం ఒక కేజీ 63 గ్రాములు, వెండి 53 కేజీల 450 గ్రాములు 2022లో జరిగిన మేడ జాతరలో మొత్తం 517 హుండీలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆదాయం 91 లక్షల 62 వేల ఆదాయం వచ్చింది.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా జాతర సమయంలో ఏర్పాటు చేసిన హుండీలను హనుమకొండ నగరం కేంద్రంగా లెక్కించడం జరుగుతుంది.
మహా జాతర జరిగిన అనంతరం వచ్చే సంవత్సరం మినీ జాతరను కూడా అధికారులు గిరిజన పూజలు నిర్వహిస్తున్నారు.2023 ఫిబ్రవరి నెలలో అధికారులు నిర్వహించారుఈ జాతర సమయంలో ఆలయ ప్రాంగణంలో దాదాపు 55 హుండీలను ఏర్పాటు చేశారు. హుండీల లెక్కింపు కార్యక్రమం మేడారం ఆలయం ఈవో రాజేంద్రన్ పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధమైన జగ్గారావు రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ భద్రత నడుమ ఎండోమెంట్ ఆవరణలో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు..
సమ్మక్క వనదేవత ఉండి ఆదాయం 52,81,584 , సాలమ్మ వన దేవత ఆదాయం 46,34,211 గోవింద రాజు హుండీ ఆదాయం 1,83,980, పగిడిద్దరాజు హుండీ ఆదాయం 1,60,830మొత్తం వనదేవతల హుండీ ఆదాయం 1,02,60,605 వచ్చింది.39 విదేశీ కరెన్సీ నోట్లు 15 తులాల బంగారం దాదాపు 8 కిలోల వెండి వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.
మేడారం ఉండి ఆదాయాన్ని లెక్కించడం కోసం సుమారు 150 మంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చారు.వారందరూ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ ప్రాంతాల నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి రావడం జరిగింది. వచ్చిన వారికి భోజన వసతి మరియు వాహనాల ఎక్స్పెండిచర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని కేవలం మనదేవతలకు సేవ చేయడం కోసమే దూరప్రాంతాల నుంచి వస్తున్నామని మహిళలు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Medaram jatara, Mulugu, Telangana