హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tiger: ఆ పులి భూపాలపల్లి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకుందా...!

Tiger: ఆ పులి భూపాలపల్లి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకుందా...!

పులి

పులి

భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాలలో తరచూ పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెప్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతాలైన పలిమేల, మహాముత్తారం మండల కేంద్రంలోని పలు గ్రామాల అటవీ పరిధిలో నెల రోజులుగా పులి సంచారిస్తున్నట్లు తెలుస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

(M. Venu, News18, Mulugu)

భూపాలపల్లి (Bhupalapally) జిల్లా సరిహద్దు ప్రాంతాలలో తరచూ పులి (Tiger) సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెప్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతాలైన ముకునూరు, సింగారం, మద్దిమడుగు, పలిమేల, మహాముత్తారం మండల కేంద్రంలోని పలు గ్రామాల అటవీ పరిధిలో నెల రోజులుగా పులి సంచారిస్తున్నట్లు తెలుస్తుంది. భూపాలపల్లి అటవీ ప్రాంతంలో గత సంవత్సరం పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అడవిని ఆనుకుని ఉన్న గ్రామాలలోకి వచ్చి పశువులపై దాడి చేసినట్లు పశువుల కాపరులు చెప్తున్నారు. తరచూ పులి సంచారం పాద ముద్రలు కనిపించడంతో భూపాలపల్లి సరిహద్దు జిల్లా అటవీ ప్రాంతంలో పులి స్థిరనివాసం ఏర్పరచుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాపర్లకు అడవిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు..

మొండి రేగడి అటవీ ప్రాంతంలో పశువుల మేత కోసం అడవిలోకి వెళ్లిన పశువుల కాపరికి పులి అడుగులు (Tiger Footprints) కనిపించాయి. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆజాద్ నగర్ రేంజ్ ఆఫీసర్ అలీ మరియు అటవీశాఖ సిబ్బంది పాద ముద్రలను  (Tiger Footprints)  పరిశీలించి పులివిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే పీకుడుపల్లి, నరసింగాపూర్, రేగులగూడెం గ్రామ పశువుల కాపర్లకు అడవిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు కూడా చేశారు అధికారులు.

మహాముత్తారం అటవీ ప్రాంతంలో (Mahamuttaram forest area) పులి లేగ దూడను చంపి తిన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి మహాముత్తారం పరిధిలోని నర్సింగాపూర్ దూదేకులపల్లి, రేగులగూడెం పందిపంపుల, సింగారం ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ గ్రామాల ప్రజలు ఏ అవసర ఉన్నా అడవిలోకి వెళ్ళకూడదని..ఎవరికైనా పులి అడుగుజాడలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వవలసిందిగా అటవీశాఖ అధికారులు సూచించారు.

Great Artist: జీవకళ ఉట్టిపడే విగ్రహాలు: భద్రాద్రి యువకుడి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే 

ఎవరైనా పులికి హాని తలపెడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గోదావరి నది దాటి పులి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన భూపాల్ పల్లి ములుగు అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పులి తిరిగి వెళ్లలేక..

గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బహుశా పులి తిరిగి వెళ్లలేక పోతుంది కావచ్చని భావిస్తున్నారు. నిజానికి పులి భూపాల్ పల్లి, ములుగు సరిహద్దు ప్రాంతాలలో ఆవాసం ఏర్పరుచుకుంటే ఈ అటవీ ప్రాంతాన్ని టైగర్ జోన్‌గా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పులి తారాసపడితే పులిని తదేకంగా చూడకూడదు, భయంతో వెంటనే పరుగులు తీయకూడదు, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ తప్పించుకోవాలి అని గతంలో న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫారెస్ట్ అధికారులు చెప్పారు.

First published:

Tags: Bhupalapally, Local News, Mulugu, Tiger

ఉత్తమ కథలు