కాయా బాగా కాసే సమయంలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచెత్తాయి. మాములు వర్షం అయితే ఏమి కాకపోవు, కానీ కురిసింది వడగళ్ల వర్షం కావటంతో రైతులను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఈ ఎండకాలంలోభారీ వర్షాలు..... దేవుడు మాపై ఈ విధంగా పగపడుతున్నాడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ములుగు జిల్లా రైతులు. గత మూడు రోజుల నుంచి ములుగు జిల్లాలో వర్షాలు బీభత్సంసృష్టిస్తున్నాయి. గతంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇలాంటి వడగండ్ల వాన ఈదురు గాలులు చరిత్రలో ఎప్పుడు చూడలేదని రైతులు చెప్తున్నారు వడగండ్ల వానలు రైతులను నిండా ముంచుతున్నాయి.
పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యం రైతులను తీవ్ర నష్టాల్లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా మామిడి రైతులు ఉగాది పండగ అనంతరం పంట చేతికి వచ్చే సమయం కానీ అకాల వర్షం మామిడి పంటను నేలపాలు చేసింది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని స్వామి అనే రైతు 30 సంవత్సరాల నుంచి మామిడి పంటపైనే ఆధారపడి జీవం కొనసాగిస్తున్నాడు..... అంతేకాకుండా తాను మామిడి తోటను లీజుకు తీసుకొని చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి తనకున్న అప్పులు తీరిపోతాయి అని సంబరపడ్డాడు. మరో రెండు రోజులు అయితే మామిడికాయలను కోసి మార్కెట్ కు పంపడమే ఆలస్యం. కానీ ఇంతలోనే తనపై దేవుడు చిన్నచూపు చూడటంతో అకాల వర్షం కారణంగా చెట్టుకు కాసిన కాపును నేలపాలు చేసింది.
దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మామిడి రైతు న్యూస్ 18 తో చెప్తున్నాడు.... పెట్టిన పెట్టుబడి తెచ్చిన అప్పులు తీరే మార్గం రైతులకుకనబడటం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. దాదాపు 10 నుంచి 15 భారీ మామిడి చెట్లు కూడా నేలకు ఒరిగాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కేవలం ఒక స్వామి అనే రైతు పరిస్థితి కాదని... జిల్లావ్యాప్తంగా మామిడి రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు రావడమే కాకుండా వడగండ్ల వర్షం కురవడంతో పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ములుగు జిల్లాలో కనిపిస్తుంది. వరి పంట సైతం చేతికొచ్చిన సమయానికి వడగండ్ల వర్షం కురవడంతో వారి చైన్లు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. ములుగు జిల్లా రైతాంగం మొత్తం గుండెలో బాధ కళ్ళనిండా నీళ్లు తెచ్చుకొని ఏమి చేయాలో తెలియక దిగాలుగా చూస్తున్నారు. దేవుడు మాపై కావాలనే పగ పట్టి ఇలా చేస్తున్నాడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Local News, Mulugu, Telangana