Home /News /telangana /

MULUGU GODAVARI RIVER FLOODED AGAIN IN JUST ONE MONTH GAP IN MULUGU DISTRICT MMV BRV PRV

Mulugu: అయ్యో భగవంతుడా..! వరదల నుంచి తేరుకోకముందే మళ్లీ భయపెడుతున్న గోదావరి..

గోదావరికి వరదలు

గోదావరికి వరదలు

నెల రోజుల క్రితం సంభవించిన వరదల నష్టం నుంచి ముంపు ప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోకముందే గోదావరి మరోసారి మహోగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    నెల రోజుల క్రితం సంభవించిన వరదల (Floods) నష్టం నుంచి ముంపు ప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోకముందే గోదావరి మరోసారి మహోగ్ర రూపం దాల్చుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి నది (Godavari river) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం వద్ద గోదావరి నది 15 మీటర్ల పైగా ప్రవహిస్తుంది. ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలు చారి చేసిన అధికారులు.. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

    ములుగు (Mulugu) జిల్లాలో భారీ వర్షాలు కురవనప్పటికీ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. హైదరాబాద్ - భూపాలపట్నం జాతీయ రహదారిలోని పుసూరు ముళ్లకట్ట హై లెవెల్ వంతెన వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వాజేడు మండలంలో లోతట్టు ప్రాంతాలలో నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నదీ ప్రవాహం తీరు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. తగ్గినట్టే తగ్గుతున్న నీటి మట్టం మళ్లీ పెరుగుతుండడంపై గోదావరి నది ప్రవాహం విషయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో పాటు ఎగువున గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులలో గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో ఏటూరునాగారం వద్ద గోదావరి నది ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే గోదావరి నది 15 మీటర్ల పైనే ప్రవహిస్తుంది.. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    మునిగిపోయిన పంట పొలాలు:

    ములుగు జిల్లాలో నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలావరకు పంట పొలాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పలు ప్రాంతాల్లో రైతులు తిరిగి పంటలు వేశారు. కానీ గోదావరిలో వరద నీరు పెరగడంతో నదీ పరివాహకంలోని పంట పొలాలు మళ్లీ నీట మునిగాయి. ముఖ్యంగా రామ్‌నగర్, లంబాడి తండా, రామన్నగూడెం, మానసపల్లి గ్రామాల్లో పంట పొలాల్లో వరద నీరు చేరింది.

    నిలిచిపోయిన రాకపోకలు:

    వరదల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాజేడు వెంకటాపురంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని ప్రధాన రహదారులన్నీ వరద నీటితో మునిగిపోయాయి. వెంకటాపురం నుంచి చర్లకు వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా వరద నీరుతో మునిగిపోయింది.

    సమీక్షిస్తున్న అధికారులు:

    గోదావరి నది వరద ప్రవాహాన్ని జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈక్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాం ఏజెన్సీ గ్రామాల ప్రజల్లో నెలకొంది. రాత్రి సమయాల్లో విద్యుత్ కూడా లేక ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి గోదావరి పరివాహకంలోని ఈ ముంపు ప్రాంతాలలో శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Godavari floods, Local News, Mulugu

    తదుపరి వార్తలు