హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: మాకూ ఆయుధాలు కావాలి.. అటవీ అధికారుల నిరసన

Mulugu: మాకూ ఆయుధాలు కావాలి.. అటవీ అధికారుల నిరసన

X
నిరసన

నిరసన చేపట్టిన అధికారులు

Mulugu: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటవీ అధికారిని అతి కిరాతకంగా జంతువులను వేటాడినట్టు గుత్తి కోయలు చంపడం రాష్ట్ర ప్రజలందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu.

ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటవీ అధికారిని అతి కిరాతకంగా జంతువులను వేటాడినట్టు గుత్తి కోయలు చంపడం రాష్ట్ర ప్రజలందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన గిరిజనులు అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో పోడు భూముల సర్వే చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుత్తి కోయ ఆదివాసీలు రేంజ్ ఆఫీసర్ నే హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులు శ్రీనివాస్ కి నివాళులు అర్పించడమే కాకుండా నిరసనలు కూడా చేపడుతున్నారు.

ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు

అటవీ అధికారులకు గుత్తి కోయ ఆదివాసుల నుంచి ప్రాణహాని ఉన్నందున అటవీ అధికారులకు కూడా ఆయుధాలు ఇవ్వాలని ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో బీట్ ఆఫీసర్ ని గుత్తి కోయ ఆదివాసీలు జంబియాలతో పొడిచి అతి దారుణంగా హతమార్చారు. అప్పటినుంచి ఫారెస్ట్ అధికారులు ఆయుధాలు కావాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ దశాబ్దాల కాలం నుంచి ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాసరావు హత్య ఘటన నేపథ్యంలో మళ్లీ ఒకసారి ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా అటవీ అధికారులు ఆందోళన చేపడుతున్నారు.

ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి

పోలీస్ వారికి ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారో ఫారెస్ట్ అధికారులకు కూడా ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అటవీ అధికారులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో అటవీ అధికారులు ఫారెస్ట్ లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. గుత్తి కోయలు జంతువులను వేటాడే మారణ ఆయుధాలతో మనుషులను కూడా వేటాడుతూ అతికిరాతకంగా అధికారులను చంపుతున్నారంటే వారు ఎంత క్రూరమైన వారు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అటవీ మధ్య ప్రాంతంలో ఉన్న గుత్తి కోయలను ఇతర ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు కోరుతున్నారు.

విధి నిర్వహణలో అటవీ అధికారులకు గుత్తి కోయ ఆదివాసీలకు గొడవలు తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ వ్యక్తిని హతమార్చడం హేయమైన చర్యగా అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ సీనియర్ ఆఫీసర్ శంకర్, సత్తయ్య న్యూస్ 18తో మాట్లాడుతూ.. అటవీ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలని ప్రతిపాదన గత కాలం నుంచి ఉన్నప్పటికీ కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు ఇవ్వడంతో పాటు ఫారెస్ట్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరణించిన రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుకి నివాళులు అర్పిస్తూ ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు.

First published:

Tags: Crime news, Forest, Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు