Home /News /telangana /

MULUGU FOR THE FIRST TIME IN MULUGU DISTRICT OFFICIALS CONDUCTING POLICE EXAM CENTERS MMV BRV PRV

Mulugu: ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​.. ములుగు జిల్లాలో మొదటిసారిగా ఆ సౌకర్యం..

ములుగులో పోలీస్​ పరీక్షా కేంద్రాలు

ములుగులో పోలీస్​ పరీక్షా కేంద్రాలు

మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో పోలీస్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం అభ్యర్థులకు కొంత వెసులుబాటు కల్పించినట్లయింది. ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం.. ప్రధాన పోటీ పరీక్షల నిర్వహణ నిమిత్తం జిల్లా పరిధిలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M.Venu, News 18, Mulugu)

    తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు (Police jobs) నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు (Preliminary Exam) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొట్టమొదటిసారిగా ములుగు (Mulugu) జిల్లాలో పోలీస్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం అభ్యర్థులకు కొంత వెసులుబాటు కల్పించినట్లయింది. ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం.. ప్రధాన పోటీ పరీక్షల నిర్వహణ నిమిత్తం జిల్లా పరిధిలోనే పరీక్షా కేంద్రాలను (Exam Centers) ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం (ఆగష్టు 7న) జరగబోయే ఎస్సై (SI) ప్రాథమిక పరీక్ష కోసం ములుగు జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ములుగు జిల్లా అధికారులు తెలిపారు. ఈ ఆరు పరీక్ష కేంద్రాలలో మొత్తం 1361 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

    పరీక్షా కేంద్రాల వివరాలు: ములుగు మండలం బండారుపల్లి మోడల్ స్కూల్, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ములుగు ప్రభుత్వ ఉన్నత జడ్పీ బాలికల పాఠశాల, ములుగు బ్రిలియంట్ స్కూల్.. ఈ ఆరు పరీక్ష కేంద్రాలలో ఇప్పటికే అధికారులు పరీక్ష ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షా సమయం కంటే ముందే వచ్చి తమ సెంటర్, హాల్ టికెట్ నెంబర్ ఎలాంటి తొందరపాటు లేకుండా నిదానంగా ప్రశాంతంగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



    హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు:

    గతంలో పోటీ పరీక్షలు రాయాలంటే వరంగల్ జంట నగరాలతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లోని అభ్యర్థులు కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఒకరోజు ముందే వెళ్లి.. అక్కడ ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకునేవారు. ఇది అభ్యర్థులకు శ్రమతో పాటు, ఖర్చుతోనూ కూడుకున్న పని. కానీ ప్రస్తుతం ములుగు జిల్లాలో మొదటిసారిగా పోలీస్ పరీక్ష కేంద్రాలు (Police Exam centers) ఏర్పాటు చేయడం తమ సొంత జిల్లాలోనే పరీక్ష రాసే అవకాశం వచ్చిందని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు సమయ భావం తగ్గుతుందని, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు.

    నిబంధనలు:

    పరీక్ష సమయానికి ఒక్క నిమిషం లేటుగా వచ్చిన అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు చేతులకు గోరింటాకు మైదాకు కోన్స్ పెట్టుకొని ఉంటే అనుమతించబోరు. అభ్యర్థుల వద్ద చేతి గడియారాలు, ఫోన్స్, బ్లూటూత్, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నా అనుమతించరు. పరీక్షా కేంద్రాలలో పరీక్ష రాస్తున్న సమయంలో పక్క వ్యక్తితో మాట్లాడినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, వారిని అనర్హులుగా ప్రకటిస్తామని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Mulugu, Police, Telangana exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు