Home /News /telangana /

MULUGU FIRST RAJANNA TEMPLE IS IN SHAPALLY VILLAGE OF MULUGU DISTRICT SNR MMV BRV

Mulugu: వేములవాడ రాజన్న అలిగి వెళ్లిపోయిన ప్రాంతం: ఎక్కడో తెలుసా?

(రాజన్న

(రాజన్న మొదటి గుడి)

Mulugu: గుట్టపై వెలిసిన లింగాన్ని గ్రామస్తులు మొదట్లో పట్టించుకోలేదని రాజన్న ఇక్కడి నుంచి వేములవాడ వెళ్ళిపోయాడని స్థానికంగా కథ ప్రచారంలో ఉంది. దీంతో స్వామి అనుగ్రహం కోసం ప్రతి శివరాత్రికి ఆ దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  (Venu Medipelly,News18,mulugu)
  మనదేశంలో వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. వేలాది సంవత్సరాలుగా రాజ్యాలను పాలించిన కొందరు రాజులు..తమ పాలనలో నాగరికతను చాటేలా ఈ ఆలయాలు నిర్మించారు. ఎంతో ఘన చరిత్ర చాటుతున్న ఈ ఆలయాలు వేటికవే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇటువంటి ఆలయాల్లో కొన్ని మాత్రమే ప్రజల సందర్శనార్ధం అందుబాటులో ఉండగా..వివిధ కారణాల వలన మరికొన్ని ఆలయాలు వెలుగులోకి రాలేదు. అటువంటి ఒక ఆలయమే ములుగు(Mulugu)జిల్లాలోనూ ఉంది. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? తెలుసుకోవాలంటే మీరు ఇది చూడాల్సిందే.

  చాళుక్యులు కాలం కంటే ముందే ఉన్న ఆలయం:
  రాజరాజేశ్వర స్వామి అనగానే మనకు గుర్తుకు వచ్చేది దక్షిణకాశీగా పిలవబడే వేములవాడ దేవాలయము. అయితే వేములవాడ రాజన్న మొదటగా ఎక్కడ వెలిశాడో మీకు తెలుసా?. వేములవాడ రాజన్న ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెప్పబడుతుంది. కానీ దానికంటే ముందే రాజన్న ములుగు జిల్లాలో (పురాణాల ప్రకారం) వెలిశాడటా. అందుకే అక్కడ దేవాలయాన్ని శ్రీరాజరాజేశ్వర దేవాలయమని, ఆ గుట్టను రాజన్న గుట్ట అని పిలుస్తుంటారు. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం షాపల్లి గ్రామంలో ఉన్న ఈ గుట్టను రాజన్న గుట్ట అని పిలుస్తుంటారు. ఆ గుట్టపై చరిత్రలో ఎక్కడా లిఖించబడని అతిపురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివ లింగాన్ని రాజన్న అని పిలుస్తుంటారు.అయితే ప్రస్తుతం స్థానికులు నిర్మించిన తాత్కాలిక ఆలయం (చిన్న గుడి) మాత్రమే మనకు కనిపిస్తుంది. చరిత్రలో చెప్పబడ్డ ఆలయం ఇప్పుడు అక్కడ లేదు.

  ఇది చదవండి: కాకతీయుల కాలం నాటి రహస్య గుట్ట.. అక్కడ వజ్ర వైఢూర్యాలు ఉన్నాయా? చరిత్రలో ఏం రాసి ఉంది?  అలిగి వెళ్లిపోయిన రాజన్న (స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం):
  ఇక్కడి గ్రామస్తుల నమ్మకం ప్రకారం పూర్వం ఒక మహిళ కలలోకి రాజన్న వచ్చి \"మీ గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టపై నేను వెలిశాను, నన్ను భక్తిశ్రద్ధలతో పూజిస్తే మీరు కోరిన కోర్కెలను నెరవేరుస్తాను\" అని చెప్పాడట. కానీ ఆ మహిళ చెప్పిన మాటలను స్థానికులెవరూ నమ్మలేదట. కొన్ని రోజుల తరువాత గొర్రెల కాపరి ఒకరు మేత కోసం గుట్టపైకి వెళ్తే అతనికి ఇక్కడ శివలింగం కనిపించిందట. అతను ఆ శివలింగాన్ని చూసి గుట్ట సమీపాన ఉన్న గ్రామస్తులకు చెప్పాడట. గ్రామస్తులు అందరూ వెళ్లి చూడగా రాజన్న రూపంగా చెప్పబడే శివలింగం ఉందట. ఇక్కడికి సమీపంలోనే శివపార్వతుల పాద ముద్రలు కూడా గ్రామస్తులకు కనిపించాయట (ఇప్పటికీ ఆ పాదముద్రలు ఉన్నాయి). అయితే గుట్టపై వెలిసిన లింగాన్ని గ్రామస్తులు మొదట్లో పట్టించుకోలేదని రాజన్న ఇక్కడి నుంచి వేములవాడ వెళ్ళిపోయాడని స్థానికంగా కథ ప్రచారంలో ఉంది. దీంతో స్వామి అనుగ్రహం కోసం ప్రతి శివరాత్రికి ఆ దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఏటూరునాగారం చుట్టుపక్కల 30 గ్రామాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు.

  ఇది చదవండి: సంకల్పానికి అడ్డురాని అంగవైకల్యం: క్రికెట్, బాస్కెట్ బాల్ ఆటల్లో రాణిస్తున్న యువకుడు  అంతుబట్టని ఆలయ నిర్మాణం:
  ఈ ఆలయ నిర్మాణం ఏ రాజు కాలంలో నిర్మించారన్న దానిపై నేటికీ స్పష్టత లేదు. ఎవరు కట్టించారు? ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం పెద్ద బండరాళ్ళతో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. గోపురం కూడా లేదు. శివలింగం ఎదురుగా ఉన్న నంది మాత్రం శిథిలమై ఉంది. ఉన్న దేవాలయం కూడా కూలిపోయే స్థితిలో ఉంది. గతంలో ఈ ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం కోసం వెళ్లిన దుండగులకు ఆ గుట్టపై ఏదో అతీత శక్తీ కనబడటంతో గడ్డపారలు అక్కడే వదిలేసి వారు పారిపోయారని గ్రామస్తులు చెబుతుంటారు.

  ఇది చదవండి: చికెన్ ఫ్రై‌కి అడ్డా 'నాగర్‌కర్నూల్': తప్పకుండ టేస్ట్ చేయాల్సిందే  రాజన్న గుట్టకు చేరుకోవడం ఎలా?:
  హనుమకొండ పట్టణం నుంచి ఏటూరునాగారం బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఏటూరునాగారం బస్సు ఎక్కి, చిన్నబోయినపల్లి గ్రామంలో దిగి, అక్కడి నుంచి షాపల్లి గ్రామం వరకు ఆటో, ప్రైవేటు వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu

  తదుపరి వార్తలు