ఎండాకాలం (Summer) వస్తుందంటే చాలు… ఏ అడవి (Forest) లో అగ్గి రాజుకుంటుందో (Fire accident) అని భయపడుతుంటారు. ఏ మూల నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో అని కంగారుపడతాం.. అలాంటిది మనకు దగ్గరలో ములుగులోని (Mulugu) మండపేట అడవి (Mandapeta forest)లో మంటలు చెలరేగాయంటే….! అవును కార్చిచ్చు దావానంలా వ్యాపించింది. ములుగు జిల్లా మంగపేట ప్రాంతంలో సాయంత్రం ఒక్కసారిగా మంటలు రావడంతో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సాయంత్రం అకస్మాత్తుగా వీచిన గాలులకు ఎటు నుంచి వచ్చిందో ఏమో అగ్గి… అడవికి ఆనుకున్న గ్రామంలోకి (Village) దావానంలా పాకింది. అటవీ ప్రాంతం నుండి శనిగకుంట గ్రామంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి (Fire accident). జనాలు చూస్తుండగానే….శరవేగంగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కపక్కనే ఆనుకుని ఉన్న గుడిసెలకు పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి.
ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా ఇళ్లు (40 Houses) అగ్నికి ఆహుతయ్యాయి. కళ్ల ముందు ఇళ్లు కాలి బూడిదవుతుంటే గిరిజనులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమకు నిలువనీడ లేకుండా పోయిందే అని కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా, కొద్దిరోజుల కిందటే అస్సాంలోని అడవిలో మంటలు చెలరేగాయి. అస్సాం లోని గుహావతిలో అర్ధరాత్రి బసిస్తా పరిధిలోని అడవిలో కార్చిచ్చు రాజుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించాయి. అసలే.. ఎండకాలం.. చెట్ల ఆకులు కూడా ఎండిపోయి ఉంటాయి. దీంతో మంటలు నిముషాల్లోనే వ్యాపించాయి. అడవిలో పెద్ద చెట్లు ఆకులు రాలిపోయి కుప్పలుగా ఏర్పాడ్డాయి. ఈ క్రమంలో అగ్నికీలలు వ్యాపించడంతో చెట్లు, ఒక దానికి మరోకటి వ్యాపించి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. అర్దరాత్రి అడవిలో మంటలు రాజుకున్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించారు . వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
వారు అడవిలో మంటలను వ్యాపిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. పైరింజన్ లతో మంటలను ఆర్పటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అడవులు దట్టంగా ఉండటం వలన ఫైర్ ఇంజన్ లోపలి వరకు రాలేక పోయింది. దీంతో మంటలను ఆర్పే వాయువులను ఉపయోగిస్తున్నారు. మంటలను ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అర్దరాత్రి బసిస్తా పరిధిలో మంటలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే దీన్ని అదుపులోనికి తెవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బంది గంటల తరబడి మంటలనుఅదుపు చేశారు.
అంతేకాదు కార్చిచ్చు దెబ్బతో ఉత్తరాఖండ్ అడవులు నాలుగు రోజులు మాడి మసి అయిపోయి. మొత్తం 46 ప్రాంతాల్లో అగ్ని దేవుడి ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 51.43 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆహుతి అయ్యింది. అంతేకాదు సగానికి పైగా వన్యప్రాణుల జాతుల ఉనికి ప్రమాదంలో పడింది. ఇప్పటివరకు కుమావున్ ప్రాంతంలో గడిచిన సంవత్సరాల్లో 21 సార్లు కార్చిచ్చు వ్యాపించగా, అందులో ప్రస్తుత అగ్ని ప్రమాదమే భారీ నష్టాన్ని కల్పించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు ఉత్తర, మధ్య భారతదేశం తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే అటవీ మంటలు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Forest, Mulugu