Home /News /telangana /

MULUGU ETURUNAGARAM FOREST AREA IN THE MULUGU DISTRICT THAT HAS BECOME AN ADDRESS FOR NATURAL BEAUTY SNR MMV BRV

Mulugu: ఆ అభయారణ్యం ప్రకృతి అందాలకు నెలవు.. ఒక్కసారి సందర్శించినా ఆ ఫీలింగే వేరు

(అడవిలో

(అడవిలో అందాలు)

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో కురుస్తున్న వర్షాలకు అభయారణ్యం మొత్తం పచ్చదనంతో పరవశించి పోతుంది. ములుగు జిల్లాకి వచ్చే పర్యాటకులకు అడవి తల్లి ఆహ్వానం పలికినట్లు రహదారి పొడవునా దట్టమైన పచ్చని చెట్లు చూపరులను ఆకర్శిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  (Venu Medipelly,News18,mulugu)
  "పచ్చందనమే పచ్చదనమే..పచ్చిక నవ్వుల పచ్చదనమే.." అంటూ పచ్చని చెట్లను, "తెల్లని తెలుపే ఎద తెలిపే..వానలు కడిగిన తుమి తెలుపే.." అంటూ వానలనూ..యువతీ అందాన్ని ప్రకృతితో పోలుస్తూ కవి రాసిన పాట ఇది. ప్రకృతి రమణీయతను ఆ కవి వివరించిన తీరు అద్భుతం. అటువంటి అద్భుతం కళ్లముందే సాక్షాత్కారం అయితే!. నెలతల్లిని తాకిన చినుకు తడికి మోడుబారిన చెట్లు, లేత చిగురు అందాలతో కనువిందు చేస్తుంటే!. చూడడానికి రెండు కళ్లు సరిపోతాయా? ములుగు(Mulugu)జిల్లా ఏటూరునాగారం (Eturunagaram)దట్టమైన అభయారణ్యం ఇప్పుడు అంతే అద్భుతంగా మారిపోయి..ప్రకృతి ప్రేమికుల్ని ఆహ్వానిస్తోంది.

  పచ్చదనం కప్పుకున్న ఏజెన్సీ: ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలో కురుస్తున్న వర్షాలకు అభయారణ్యం మొత్తం పచ్చదనంతో పరవశించి పోతుంది. ములుగు జిల్లాకి వచ్చే పర్యాటకులకు అడవి తల్లి ఆహ్వానం పలికినట్లు రహదారి పొడవునా దట్టమైన పచ్చని చెట్లు చూపరులను ఆకర్శిస్తున్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట్ మండలం పసర గ్రామం చివరి నుంచి ఏటూరునాగారం వరకు దాదాపు 35 కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఏటూరునాగారం అడవులు ఆకురాల్చే అడవులుగా ప్రసిద్ధి చెందాయి. ఎండాకాలంలో చెట్లన్నీ ఆకులు రాలి, అడవి మోడుబారిపోతుంది. కానీ వర్షాకాలం తొలకరి చినుకులు పడగానే అడవి మొత్తం పులకరించిపోతుంది. ఎండలకు ఎండిపోయిన చెట్లన్నీ తొలకరి చినుకులకు పరవశించి పోతాయి. లేతగా వచ్చే చిగురులతో అడవి మొత్తం పచ్చగా మారిపోతుంది. అరణ్యానికి ఎవరైనా పచ్చటి రంగు వేశారా అన్న మాదిరిగా దట్టమైన చెట్లతో, పచ్చని ఆకులతో మొత్తం కళకళలాడిపోతోంది.

  ఇది చదవండి: పేదవాడి సొంతింటి కల నెరవేరేదేప్పుడు?: ములుగు జిల్లాలో అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు  వన్యప్రాణులకు నిలయం: ఏటూరునాగారం అభయారణ్యంలో ఎన్నో వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. దాదాపు 806 చ.కి.మీ.ల విస్తీర్ణంలో దట్టంగా వ్యాపించి ఉన్న ఈ అభయారణ్యంలో ఎన్నో వేల వృక్ష జాతులు, వందల జంతు జాతులు ఉన్నాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం చూస్తే ఏటూరునాగారం అభయారణ్యంలో అడవి దున్నలు, మనుబోతు, కనుజు, చుక్కల దుప్పి, కొండ గొర్రె, ఎలుగు బంటి, నక్కలు, అడవి కుక్కలు, తోడేళ్ళు, ఎక్కువ సంఖ్యలో అడవి పందులు సంచరిస్తుంటాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇటీవలే ఏటూరునాగారం అడవిలో పులి జాడలు కనిపించాయి. వన్యప్రాణులు లెక్కించడం కోసం అటవీశాఖ అధికారులు ఈ అటవీ పరిధిలో 63 ప్రాంతాలను ఎంపిక చేసి 126 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ సీసీ కెమెరాలలో ఎక్కడా పులి జాడలు మాత్రం కనిపించలేదు. ఇక్కడ వెదురు, మద్ది, చిరుమాను, సారపప్పు చెట్టు, ఆకురాల్చు పొడిటేకు వంటి వృక్షజాలం ఉంది.

  ఇది చదవండి: మంత్రి కేటీఆర్ ఇలాకాలో నాసిరకం పనులు: చెక్ డ్యామ్ నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు  అనేక పర్యాటక ప్రాంతాలు: తెలంగాణ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనటువంటి పర్యాటక ప్రాంతాలు ములుగు జిల్లాలో ఉన్నాయి.. కేవలం ఈ అరణ్యం గుండా వెళ్తే అనేక ప్రాంతాలను చూడవచ్చు. ముఖ్యంగా తెలంగాణ నయాగరా బొగత జలపాతం, కొంగల జలపాతం, ముత్యాల ధార జలపాతం ఇంకా మనకు తెలియని ఎన్నో జలపాతాలతో ఏటూరు నాగారం అభయారణ్యం ఒడిలో ఉన్నాయి. వీటిలో ముత్యాల జలపాతం చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆకాశం నుంచి ఎవరైనా పాలు పోస్తున్నారా అన్న విధంగా పాలధార వలె జాలువారుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు లి సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.

  ఆదిమనవుల సమాధులు: ఎటునాగారం అభయారణ్యంలో మనకు తెలియని చరిత్ర ఇంకా దాగి ఉంది. అభయారణ్యంలో మల్లూరు గుట్టలో దామర గ్రామం, ఇతర ప్రాంతాలలో ఎంతో చరిత్ర మరుగున పడిపోయింది. ఎటునాగారం అభయారణ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడక్కడా ఆదిమ మానవుల సమాధులు ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ పూర్వికులు నివసించి ఉండేవారని ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు బట్టి తెలుస్తుంది.

  కాకతీయుల చరిత్ర: ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో కాకతీయుల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దుర్గం కోట, మల్లూరు గుట్టపై ఉన్న కాకతీయుల రహస్య సైనిక స్థావరాలే ఇందుకు నిదర్శనం. కాకతీయుల వారసులు ఇప్పటికీ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టే కాకతీయులు కూడా గోదావరి పరివాహక ప్రాంతం వెంబడే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నట్లు చారిత్రక కట్టడాల ద్వారా తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏటూరునాగారం అభయారణ్యం గురించి పదాలు సరిపోవు కావచ్చు.

  ఇది చదవండి: కేటీఆర్ సార్! మానాన్నని బ్రతికించండి: మంత్రికి లేఖ రాసిన ఇద్దరు సిరిసిల్ల జిల్లా బాలికలు


   

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mulugu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు