Home /News /telangana /

MULUGU ETURNAGARM ITDA PO ANKITH DOING TREMOUNDUS JOB FOR TRIABL WELFARE IN MULUGU DISTRICT ABH BRV MMV

Mulugu: ఇలాంటి ఒక ఆఫీసర్ ఉంటే గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం

నాణ్యత లోపిస్తే సహించేది లేదు... హెచ్చరిస్తున్న ప్రాజెక్ట్ అధికారి

నాణ్యత లోపిస్తే సహించేది లేదు... హెచ్చరిస్తున్న ప్రాజెక్ట్ అధికారి

ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల అనుబంధ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజన విషయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏటూర్‌నాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ హెచ్చరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    Mulugu; ములుగు జిల్లా ఏటూరునాగారం(eturunagaram) పరిధిలోని గిరిజన పాఠశాలల అనుబంధ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజన విషయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏటూర్‌నాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ హెచ్చరించారు. ఏజెన్సీలో(Agency) విస్తృతంగా పర్యటిస్తున్న ఐటీడీఏ పీఓ అంకిత్, ఐటీడీఏ పరిధిలో నడిచే గిరిజన పాఠశాలలు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అధికారులకు గుబులు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నాడు. ఇటీవల పలు జిల్లాలో స్కూల్ పిల్లలు మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకు గురైన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఐటీడీఏ అధికారి అంకిత్ ఏటూరునాగారం(eturunagaram) పరిధిలో వసతి గృహాలను పర్యవేక్షించారు. వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మెనూ పై ఆరా తీసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు నాణ్యమైన భోజనం(Mid lunch) అందించాలని నిర్వాహకులకు సూచించారు. దీంతోపాటు పిల్లలకు పాఠశాలల్లో నాణ్యమైన(Quality) విద్యను అందించాలని పేర్కొన్నారు.

    ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ:
    ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ రెండు రోజుల క్రితం గిరిజన పాఠశాలలు, హాస్టల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో హాస్టల్లో మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు(Manager), సిబ్బంది గుండెల్లో గుబులు మొదలైంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎప్పుడు వస్తారో తెలియదు! భోజనం వివరాలు ఎలా అడుగుతారో తెలీదు! కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం భోజనం ఏర్పాటు చేస్తే సరిపోతుందని హాస్టల్ వార్డెన్లు మాట్లాడుకుంటున్నట్లు విద్యార్థుల ద్వారా తెలిసింది. ప్రతి గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టిక ఆహారం మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ అంకిత్ హెచ్చరిస్తున్నారు.

    ప్రత్యేక అధికారుల నియామకం: నాణ్యమైన విద్య, భోజనం అందించేలా, విద్యార్థులకు సరైన సదుపాయాలు అందేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్. ఏటూరు నాగారం మండలంలోని గిరిజన విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యతను ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వసంతరావుకు అప్పచెప్పారు. వాజేడు వెంకటాపురం పరిధిలో నడిచే విద్యా సంస్థల బాధ్యతను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములకు అప్పచెప్పారు. ములుగు మండలం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు ఏఓ దామోదర్ స్వామిని నియమించారు. తాడ్వాయి, గోవిందరావుపేట మండలాలకు సంబంధించి ఎస్ఓ రాజ్ కుమార్‌ను నియమించారు. మంగపేట మండలానికి ప్రాజెక్టు హార్టికల్చర్ అధికారి భారతిని, కన్నాయిగూడెం మండలానికి డీఈఈ నవీన్‌లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఈ అధికారులందరూ తమ ప్రణాళిక ప్రకారం ప్రతి వసతి గృహాన్ని తనిఖీ చేసి పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన, సదుపాయాలు అందేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేశారు.

    Read this also; Mulugu: ఆ ఊరులో బస్సు నడపాలంటే ఆర్టీసీ డ్రైవర్లకు ఎక్కడలేని కోపం: ఎందుకో తెలుసా?

    తల్లిదండ్రుల్లో సంతోషం:గిరిజన విద్యార్థులకు ఇలాంటి ఒక ప్రాజెక్టు ఆఫీసర్ ఉంటే పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుందని వసతి గౄహల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. అంతేకాకుండా ఐటీడీఏ పరిధిలో ఇద్దరు గిరిజన బాలికలు జాతీయ స్థాయి కరాటే పోటీలలో అర్హత సాధించారని తెలిసి ఒక్కొక్కరికి రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ అందించారు. ఒకవైపు ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ... అధికారులను తీరును హెచ్చరిస్తూ, ఐటీడీఏ పరిధిలో అన్ని కార్యాలయాలను పర్యవేక్షిస్తూ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు