Home /News /telangana /

MULUGU ETURNAGARAM ITDA GIVING A GOOD OPPORTUNITY FOR TRIBAL GRADUATES PROVIDING FREE SOFTSKILLS TRAINING MMV ABH BRV

Mulugu: గిరిజన నిరుద్యోగ యువకులకు ఐటీడీఏ బంపర్ ఆఫర్: ప్రతిభ కనబరిస్తే పక్కా ఉద్యోగం

గిరిజన నిరుద్యోగ యువకులకు ఐటీడీఏ బంపర్ ఆఫర్

గిరిజన నిరుద్యోగ యువకులకు ఐటీడీఏ బంపర్ ఆఫర్

డిగ్రీ ఆపై ఉన్నత చదువులు పూర్తి చేసిన గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ఏటూరునాగారం ఐటీడీఏ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారు ఇచ్చే వృత్తి నైపుణ్య శిక్షణలో ప్రతిభ కనబరిస్తే జాతీయ స్థాయి కంపెనీలలో ఉద్యోగం సంపాదించవచ్చు

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    M.Venu, News 18, Mulugu

    Mulugu; డిగ్రీ ఆపై ఉన్నత చదువులు పూర్తి చేసిన గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ఏటూరునాగారం(Eturunagaram) ఐటీడీఏ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారు ఇచ్చే వృత్తి నైపుణ్య శిక్షణలో ప్రతిభ కనబరిస్తే జాతీయ స్థాయి కంపెనీలలో ఉద్యోగం సంపాదించవచ్చు. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అందించే ఈ ఉచిత శిక్షణలో అభ్యర్థులు ప్రతిభ కనబరిస్తే పక్కా ఉద్యోగం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. దానికి అభ్యర్థులు చేయవలసిందిల్లా ఒక్కటే. డిగ్రీ, ఆపై చదువులు పూర్తి చేసిన గిరిజన అభ్యర్థులకు మాత్రమే ఈ ఉచిత శిక్షణ అందిస్తున్నారు.

    గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు జాతీయస్థాయి కంపెనీలలో ఉద్యోగం పొందేలా ఏటూరునాగారం(eturunagaram) ఐటీడీఏ అధికారులు తమ వంతు సహకారం అందిస్తునాన్రు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ, మొదలగు కోర్సులు పూర్తిచేసిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు జాకరం, వరంగల్( warangal) మరియు కాటరంలో యూత్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఆయా ఫౌండేషన్(foundation courses) కోర్సుల నిమిత్తం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఈ ట్రైనింగ్‌లో జాయిన్ అయిన వారికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.

    ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లో డిజిటల్ లైబ్రరీ(digital library), న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఇంటర్నెట్, స్టడీ మెటీరియల్, కంప్యూటర్ ల్యాబ్‌తో (Computer lab) పాటు అనుభవమున్న ఫ్యాకల్టీ, కౌన్సిలర్స్ ద్వారా మూడు నెలల పాటు సాప్ట్ స్కిల్స్, కమ్యూనికేషేన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ పెంపొందించేలా శిక్షణ ఇస్తారు. ఫౌండేషన్ కోర్సులలో జాయిన్ అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ మరియు బోజన వసతి కల్పించి మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

    ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఐటీడీఏ పీఓ:
    ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ ఐఏఎస్...ఇటీవల నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు నిరుద్యోగులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఐటీడీఏ మంచి అవకాశం కల్పిస్తుందని, అభ్యర్థులు కష్టపడి శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు ఈ ఫౌండేషన్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని పీఓ అంకిత్ వివరించారు. అభ్యర్థుల కోసం మూడు సెంటర్లలో ఏటూరునాగారం, కాటరం, వరంగల్‌లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

    Read this also; Rajanna Sircilla: పనిమంతులంటే వీళ్లే.. మహా’నాటుగాళ్లు’: వరినాట్లు వేసేందుకు వచ్చిన బీహార్ కూలీలు

    ఇలా అప్లై చేయాలి: ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువతీయువకులు తమ యొక్క విద్యార్హతలతో కూడిన జిరాక్స్ సర్టిఫికెట్స్, బయోడేటాను ఐటీడీఏ ఏటూరునాగారం కార్యాలయంలో గానీ లేదా https://forms.gle/NMUSrVAn1HbghYDp7 వెబ్ సైట్ గాని సంప్రదించాలి. అభ్యర్థులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే పూర్తి వివరాల కొరకు సంప్రదించు. ఫోన్ నెంబర్స్ 9490341911, 8008932159.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: EDUCATION, Local News, Mulugu, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు