Home /News /telangana /

MULUGU ETURNAGARAM ATHLETES WHO EXCEL IN STATE AND NATIONAL LEVEL SPORTS LACK ENCOURAGEMENT FROM GOVT MMV BRV PRV

Mulugu: ఆ ఏరియాలో అందరూ మట్టిలో మాణిక్యాలే.. ఆటల్లో చిరుతలే.. కానీ..

ములుగు

ములుగు జిల్లా క్రీడాకారులు

గిరిజన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ కనబరుస్తూ ములుగు జిల్లా ఖ్యాతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈక్రీడాకారులకు ప్రతిభ ఉన్నా ప్రోత్సాహకం మాత్రం కరువైంది

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India
    (M. Venu, News 18, Mulugu)

    ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారంలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ గిరిజన (Tribes) క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ కనబరుస్తూ ములుగు జిల్లా ఖ్యాతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈక్రీడాకారులకు (Sportsmen) ప్రతిభ ఉన్నా ప్రోత్సాహకం మాత్రం కరువైంది. అనేకమంది క్రీడాకారులను తయారు చేసిన ఈ ప్రాంతం ప్రస్తుతం కనీస క్రీడా వసతులు లేక వెలవెలబోతుంది.

    ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో (Agency area) అన్ని ఆటలకు సంబంధించిన జాతీయ స్థాయి క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వాలీబాల్, కబడ్డీ, కోకో, కరాటే వంటి ఆటలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జావలిన్ త్రో ఆటతో ఇక్కడ ప్రాంత వాసులకి పెద్దగా పరిచయం లేదు. ఈ ఆటకు సంబంధించిన విభాగంలో నీరజ్ చోప్రా భారతదేశానికి బంగారు పతకం సాధించే వరకు చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేదు. కానీ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఒక్కసారిగా బంగారు పతకం సాధించడంతో అందరి దృష్టి ఈ ఆటపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఏటూరు నగరానికి చెందిన సాయి కీర్తన అనే బాలిక జావలిన్ త్రో ఆటలో రాష్ట్ర స్థాయికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈక్రమంలో జావెలిన్ త్రో (Javelin throw) క్రీడాకారిణి సాయి కీర్తన (Keerthana) కోసం న్యూస్ 18 టీం ఏటూరు నాగారం (Eturu nagaram) చేరుకుంది. ఆటలో తాను ఈస్థాయికి చేరుకోవడం వెనుక తన కోచ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని తెలిపింది. కేవలం రెండు నెలల కఠోర సాధనతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు సాయి కీర్తన తెలిపింది.



    ప్రైవేట్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు:

    ఏటూరునాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం విశాలంగా ఉంటుంది. పాఠశాల సమయం ముగిసిన అనంతరం.. స్థానిక క్రీడాకారులు ఈ మైదానానికి చేరుకుంటారు. పర్వతాల కుమారస్వామి (హ్యాండ్ బాల్ కోచ్) గత మూడేళ్ళుగా ఉచితంగానే ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇతని ఆధ్వర్యంలోనే సాయి కీర్తన జావెలిన్ త్రో ఆటలో రాష్ట్రస్థాయికి ఎంపికైంది. తమలాంటి అనేకమంది క్రీడాకారులను తయారు చేయడంలో పర్వతాల కుమారస్వామి కృషి ఎంతో ఉందని అతని వద్ద శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు చెబుతున్నారు.

    ఎటువంటి ప్రోత్సాహం అందడంలేదని..

    క్రీడలపై (Sports) ఇష్టంతోనే ఎటువంటి ఫీజు ఆశించకుండా క్రీడాకారులకు తన వంతు సహాయంగా వారికి కావాల్సిన ఆటలలో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ కుమారస్వామి తెలిపారు. వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే లక్ష్యంగానే ఈ స్పోర్ట్స్ క్లబ్ నడుపుతున్నట్లు చెబుతున్న కుమారస్వామి (Kumara swamy).. ప్రభుత్వ పరంగా ఇక్కడి క్రీడాకారులకు ఎటువంటి ప్రోత్సాహం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మైదానాలు ఉన్నాయి క్రీడాకారులు ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా క్రీడాకారులకు సదుపాయాలను కల్పిస్తూ వారికి శిక్షకులను ఏర్పాటు చేస్తే అన్ని క్రీడా అంశాలలో ఏటూర్ నాగారం క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించే సత్తా ఉందని కుమారస్వామి అంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Mulugu, Sports, Tribes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు