Venu, News18, Mulugu
ములుగు జిల్లా (Mulugu District) ఐటీడీఏ ఏటూరు నాగారం గిరిజన ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. గత కొద్దికాలం క్రితం ఐటిడిఏ ఇన్ ఛార్జ్ పీవో పాలనలోనే కొనసాగింది. ఆ దశలో గిరిజన ప్రజలు గిరిజన యువతి యువకులు అనేక ఇబ్బందులకు పాల్పడ్డారు. ఒకానొక దశలో ఐటీడీఏ ఏటూరు నాగారం తన ఉనికిని కోల్పోతుందా అనే స్థాయికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఐడిడీఐ ఏటూర్ నాగారానికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ ఆఫీసర్ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ పరిపాలనలో ఉన్న ఐటీడీఏ ఏటూర్ నాగారం పూర్తిస్థాయి ప్రాజెక్టు ఆఫీసర్ చేతిలోకి వెళ్ళిపోయింది. పూర్తిస్థాయి పీవో రావాలని గిరిజన సంఘాలు, గిరిజన విద్యార్థులు, గిరిజన ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు.
గిరిజనుల ఎదురుచూపులను చూసి సమ్మక్క సారలమ్మ దేవతలు కనికరించారు కాబోలు ఏటూర్ నాగారం ఐటిడిఏ సంస్థకు అంకిత్ ఐఏఎస్ ను ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తనదైన ముద్ర వేసుకుంటున్న అంకిత్..!
నూతనంగా ప్రాజెక్టు ఆఫీసర్ గా వచ్చిన అంకిత్ ఐఏఎస్ కు అనేకసవాళ్లు ఎదురుగా ఉన్నాయి. కుంటుపడిన పరిపాలన, ఆశించినంత స్థాయిలో లేని అభివృద్ధి, గిరిజన జీవన ప్రమాణాలు, విద్యా విధానం ఇవన్నీ పెద్ద సమస్యగా మారాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తూ తనదైన ముద్రను వేసుకుంతున్నారు అంకిత్ ఐఏఎస్. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరమే గోదావరి ఉగ్రరూపం దాల్చి గిరిజన ప్రాంతాలను ముంచి వేసింది.
ములుగు జిల్లా కలెక్టర్ తో కలిసి అంకిత్ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు పడ్డారు. అనంతరం అంకిత్ విద్యారంగంపై దృష్టి సారించారు. గృహాల్లో విద్యార్థులకు అందించే భోజనం, వసతుల గురించి ఆరా తీయడం కొనసాగించారు. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. వసతి గృహాల్లో చదివే గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా వరుస ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్న నేపథ్యంలో గిరిజన నిరుద్యోగుల కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జాకారంలో ప్రత్యేక వసతి, శిక్షణను ఏర్పాటు చేశారు. ఇందులో శిక్షణ తీసుకున్న గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు మంచి ఫలితాలను సైతం సాధించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మొత్తం 250కి పైగా యువతీ యువకులకు ప్రిలిమ్స్ కోసం శిక్షణ ఇవ్వగా 180 అర్హత సాధించారు. 174 మందికి ఫిజికల్ కోచింగ్ ఇవ్వగా 159 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు.
గిరిజన నిరుద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో అతి త్వరలోనే గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు సైతం వచ్చిన శిక్షణను ఇవ్వనున్నట్లు పీవో అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే యువతీ యువకులు స్వయం ఉపాధి పై ప్రత్యేక దృష్టి పెడుతున్న నేపథ్యంలో వారికి సంక్షేమ ఫలాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది ఐటీడీ ఏటూర్ నాగారం. పీఎం ఈజిపి కింద పది యూనిట్లను చేయనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఐటిడిఏ ఏటూరు నాగారం యువతకు అండగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఐటీడీఏ పీవో పనితీరుతో నిరుద్యోగులు, యువతీ యువకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana