Venu, News18, Mulugu
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో క్రీడా సంబరం ప్రారంభం కానుంది. మొట్టమొదటిసారిగా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి క్రీడలు జరగనున్నాయి. స్థానిక కొమరం భీమ్ స్టేడియంలో ఎంతో అట్టహాసంగా ఈక్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా ప్రాంగణంలో 2000 మంది గిరిజన విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు ఐటిడిఏ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో చదివే క్రీడాకారులు ఇక్కడికి రానున్నారు.
కరోనా అనంతరం ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ఈ క్రీడలకు ములుగు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. ఆటల పోటీలకు వచ్చే క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలుకల్పిస్తూ ఏటూర్ నాగారం ఐటిడిఏ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఏటూరు నాగారం ఆతిథ్యం ఇవ్వనుంది.
అక్టోబర్ 17న మధ్యాహ్నం ఐటీడీఏ భద్రాచలం, ఉట్నూర్ మరియు ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 2000 మంది బాలబాలికలు మరియు స్పోర్ట్స్ ఆఫీసర్స్, అధికారులు పాల్గొననున్నారు. క్రీడల్లో భాగంగా వసతి, భోజనం, మంచి నీరు గ్రౌండ్ ప్రిపరేషన్, వైద్య సహాయం, ప్రెస్ - పబ్లిసిటీ కమిటీ, స్టేజ్ కమిటీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిటీ, స్పోర్ట్ ఆఫీసర్స్ కమిటీలను ఏర్పాటుచేసి ప్రత్యేకంగా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నాడు. క్రీడాకారులకు, అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత ఆ కమిటీలదే నని స్పష్టం చేశారు. అందరూ కలసి రాష్ట్ర స్థాయి క్రీడలను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ కోరారు.
Telangana: జోగులాంబ అమ్మవారి హుండీలో 100 కోట్ల రూపాయల చెక్కు .. కానుక వేసిందెవరో తెలుసా..?
ఏటూరునాగారం కొమురం భీమ్ స్టేడియంలో 2022 అక్టోబరు 18 నుండి అక్టోబర్ 20 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ పోస్టర్ను అధికారులు ఇప్పటికే విడుదల చేసారు. క్రీడాకారులకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఎర్పాటు చేశారు. భోజనం ఏర్పాట్లపై 20 కౌంటర్స్ ఎర్పాటు చేయాలన్నారు. ప్రతి సెంటర్లో ప్రత్యేకంగా ఇంజినీరింగు విభాగం నుండి ఒకరిని కేటాయించారు. కల్చరల్ ప్రోగ్రామ్ కొరకు కొరకు 6 పాఠశాలలను ఎంపిక చేశారు. మొత్తం మీద కరోనా అనంతరం జరుగుతున్న క్రీడల నేపథ్యంలో ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో సందడి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Sports, Telangana