హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవించిన జిల్లా అదనపు కలెక్టర్ .. మంత్రి రియాక్షన్ ఏంటంటే..

Telangana: ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవించిన జిల్లా అదనపు కలెక్టర్ .. మంత్రి రియాక్షన్ ఏంటంటే..

MULUGU IAS(FILE PHOTO)

MULUGU IAS(FILE PHOTO)

వారు తలుచుకుంటే ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఖరీదైన వైద్యం కూడా ప్రభుత్వం కల్పించే ఇన్సూరెన్సు ద్వారా తక్కువ ఖర్చుకే దొరుకుతుంది. అయితే వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం ఉంచారు. గర్భం దాల్చిన ఆ అదనపు మహిళా కలెక్టర్ ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవించి

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bhupalpalle, India

ఆమె ఒక జిల్లాకు అదనపు కలెక్టర్(Additional collector).ఆమె భర్త సైతం ఒక జిల్లాకు కలెక్టర్(Collector). ఇద్దరికీ చేతి నిండా సంపాదన, ప్రభుత్వం నుంచి ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వారు తలుచుకుంటే ప్రైవేటు ఆసుపత్రు(Private hospital)ల్లోనే ఖరీదైన వైద్యం కూడా ప్రభుత్వం కల్పించే ఇన్సూరెన్సు ద్వారా తక్కువ ఖర్చుకే దొరుకుతుంది. అయితే వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం ఉంచారు. గర్భం దాల్చిన ఆ అదనపు మహిళా కలెక్టర్ ప్రభుత్వాసుపత్రి(Government Hospital)లోనే ప్రసవించి అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో భరోసా నింపారు. ములుగు జిల్లాలో ఓ జిల్లా ఉన్నతాధికారి సింప్లీ సిటీ అందరితో శభాష్ అనిపించుకుంటోంది.

Sad news : ఆడుకుంటున్న చిన్నారులను పరుగులు పెట్టించిన కోతుల గుంపు .. భయపడిన నలుగురిలో ఇద్దరు..

కలెక్టర్ దంపతుల గొప్ప ఆలోచన..

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర భార్య.. ఇలా త్రిపాఠీ ములుగు జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిండు గర్భిణీ అయిన ఇలా త్రిపాఠీకి సోమవారం పురిటి నొప్పులు రావడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రిలోని గైనకాలజిస్టూలు లావణ్య, శ్రీదేవి, విద్య , సంధ్యారాణిలు ఇలా త్రిపాఠిని పరీక్షించారు. కడుపులో బిడ్డ బరువు కారణంగా సాధారణ ప్రసవం సాధ్యం కాదని గుర్తించి వెంటనే సిజేరియన్ చికిత్స ద్వారా ప్రసవం చేశారు వైద్యులు. ఇలా త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారని వైద్యులు తెలిపారు.ఈ ఆపరేషన్ సమయంలో డాక్టర్లతో పాటు అనిస్థిషియా నిపుణుడు శ్రీకాంత్‌, ఆర్‌ఎంవో ప్రవీణ్‌ ఉన్నారు.జిల్లా కలెక్టర్ ...ఆయన సతీమణి అదనపు కలెక్టర్‌గా ఉన్న అధికారిణి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ కావడంపై తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్‌రావు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామమని సూచించారు.

సర్కారు హాస్పిటల్‌లో సుఖ ప్రసవం..

తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, అదనపు కలెక్టర్‌కు పుట్టిన శిశువు 3.4కిలోల బరువు ఉందన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజీవయ్య తెలిపారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రి, వైద్యులపై నమ్మకం ఉంచి ఇక్కడే ప్రసవానికి మొగ్గు చూపిన కలెక్టర్ దంపతులను అందరూ అభినందిస్తున్నారు.

Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

ఆదర్శ అధికారిణి..

ఈ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆస్ప త్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని రెండు జిల్లాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సౌకర్యం ఉందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు చెప్పడమే కాదు ప్రయోగాత్మకంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మేడమే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి డెలివరీ కావడం అందరిని అలోచింపజేస్తోంది. సర్కారు దవఖానాపై ప్రజలకు నమ్మకం కలిగిస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Mulugu, Telangana News

ఉత్తమ కథలు