Venu Medipelly, News18, mulugu
పోలీస్ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న హోంగార్డ్స్...హోంగార్డ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైందో మీలో ఎంతమందికి తెలుసా?...1946 సం॥లో బొంబాయిలో జరిగిన అల్లర్లు, మతవిద్వేశాలలో పోలీసులకు సహాయకారిగా ఈ హోమ్ గార్డ్సు యొక్క సేవలను విరివిగా ఉపయోగించుకున్నారు. అప్పటి ప్రధానమంత్రి మురార్జీ దేశాయి చొరవతో భారతదేశంలోని అన్ని రాష్ట్రలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో హోమ్ గార్డు సేవలను ఉపయోగించుకున్నందుకుగాను హోమ్ గార్డ్సు చట్టం, రూల్స్ తీసుకురావడం జరిగింది.
స్వతంత్ర భారత దేశంలో హోమ్ గార్డు వ్యవస్థను స్వచ్చంద సంస్థగా 1946 డిసెంబర్ 6వ తేదిన ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కావున ప్రతీ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన హోమ్ గార్డ్సు రైజింగ్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమ్ గార్డ్సు స్వచ్చందంగా ఇండియన్ పోలీసుకు సహాయకారిగా ఉంటూ సేవలు అందించేవారు.
కొంతకాలం గడిచిన తర్వాత చైనాతో భారత్ \"సినో ఇండియన్\" యుద్ధం 1966లో జరిగిన తర్వాత ఈ హోమ్ గార్డ్సు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. ఈ యుద్ధానంతరం భారత పౌరులు స్వచ్చందంగా ఈ వ్యవస్థలో అధిక సంఖ్యలో చేరారు. సమాజ సేవకోసం కార్మీకులు, కర్షకులు, విధ్యార్ధిని, విద్యార్థులు ఈ సంస్థలో చేరేవారు. హోంగార్డు ఆవిర్భవ దినోత్సవం మంగళవారం పోలీస్ హెడక్వార్టర్స్ ములుగు నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ Dr. సంగ్రామ్ సింగ్, G పాటిల్ ఆదేశాలమేరకు జిల్లా DCRB DSP సుభాష్ బాబు ముఖ్యతిదిగా పాల్గొన్నారు. ముందుగా హోంగార్డు ఆఫీసర్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
కంపెనీ కమాండర్ గా అజ్మీరా వెంకటరామ్ 1st & 2nd ప్లాటూన్ కమాండర్ లు గా కోయిల జితేందర్ బాబు, వేముల వెంకటేశ్వర్లు వ్యవహరించారు, ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ విధులకు సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డు ఆర్గనైజేషన్ ప్రస్తుత సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని ఇదే స్పూర్తితోవృత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తూ.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు
హోమ్ గార్డు సేవలలో ప్రధానమైనవి
నేర నియంత్రణలో, శాంతిభద్రలు, ట్రాఫిక్ నియంత్రణ, బ్లూకోల్డ్స్, పెట్రోల్కార్డ్రైవర్లు కార్యాలయాల భద్రత, రాత్రి గస్తీ, జాతరలు, పండుగలు, పర్వదినాలు, వి.ఐ.పి, వి.వి.ఐ.పి బందోబస్తులు, అగ్నిప్రమాదాలు, ఉప్పెనలు, వరదలు సంభవించినపుడు నష్ట నివారణ చర్యలలో చురుకుగా పాల్గొనడం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana