Venu Medipelly, News18, mulugu
సహజంగా మనందరం ప్రతి వారం ఇంట్లోకి సరిపడా కూరగాయలను ఒకేసారి మార్కెట్లలో కొనుగోలు చేస్తూ ఉంటాం పల్లె ప్రాంతాలలో వారాంతపు అంగడి ( మార్కెట్) లో కూరగాయలను కొంటూ ఉంటాం. కానీ నగర ప్రజలు మాత్రం సూపర్ మార్కెట్లలో కూరగాయలను కొనుగోలు చేస్తూ ఉంటారు. త్వరగా పాడైపోయే కూరగాయలను చల్లని ప్రదేశంలో నిలువ ఉంచి ఎక్కువ రోజులు ఉండేలా చేస్తుంటారు. కూరగాయల విషయంలో సామాన్య ప్రజలు తెలియకుండానే మోసపోతుంటారు చూడటానికి తాజా కూరగాయలు లా కనిపించిన అవి మాత్రం తాజా కూరగాయలు కాదు పల్లెటూరు లాంటి ప్రాంతాలలో రైతులు ఇంటి ఆవరణలో వ్యవసాయ పొలాల వద్ద కూరగాయలను పెంచుతూ ఉంటారు
ఇదే తరహాలో గిరిజన ప్రజలు ఇంటి ఆవరణ స్థలంలోనే ఎలాంటి పురుగు మందులను ఉపయోగించకుండా కూరగాయల సాగు చేస్తూ ఉంటారుపూర్వపు కాలంలో ఆణిక్కాయ బుర్రలలో మంచినీరును నిల్వ ఉంచుకొని తాగేవారు ప్రస్తుతం మాత్రం అలాంటి ఆనిక్కాయ బుర్రలను చూద్దామన్న కనిపించడం లేదు. అవి చూడాలంటే తాడ్వాయి అడవిలోకి రావాల్సిందేకనుమరుగైన సొరకాయ బుర్రలను తాజా కూరగాయలను ఇక్కడ ఆదివాసీలు అమ్ముతున్నారు.
ఆదివాసీలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో దొరికే అటవీ ఉత్పత్తులను తింటూ జీవిస్తూ ఉంటారు అలాగే వీరు పండించిన కూరగాయలు కానీ పంటలు కానీ చాలా పోషక విలువలు ఉంటాయి. ఎందుకంటే వారు రసాయన ఎరువులు ఉపయోగించరు కాబట్టి.....అలాంటి కూరగాయాలని ఆదివాసి ప్రజలు పస్రా తాడ్వాయి జాతీయ రహదారికి ఇరువైపులా పెట్టి అమ్ముతున్నారు.
వారితో న్యూస్ 18 ప్రతినిధి మాట్లాడడం జరిగింది. పండించే కూరగాయలకు ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించమని ప్రకృతితో పాటే కూరగాయలు కూడా సహజ సిద్ధంగా పండుతాయని మా వద్ద దొరికే సొరకాయలు బీరకాయలు వంకాయలు, దొండకాయలు , బుడంకాయలు చాలామంది వాహనదారులు ఆపిమరి కొనుగోలు చేస్తున్నారని ఇలా చేయడం ద్వారా రోజుకు రెండు వందల నుంచి 300 రూపాయలు సంపాదిస్తున్నామని ఆదివాసీలు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana