హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ఆదివాసీ గర్భిణీకి అంగన్వాడి అధికారుల సీమంతం

Mulugu: ఆదివాసీ గర్భిణీకి అంగన్వాడి అధికారుల సీమంతం

X
అంగాన్వాడి

అంగాన్వాడి అధికారులు చేసిన సీమంతం

Mulugu: ఆదివాసీ మహిళలకు శ్రీమంతం చేసిన అంగన్వాడి అధికారులు. సర్వ సాధారణంగా గర్భం దాల్చిన మహిళలకు ఆరు నెలలు నిండిన అనంతరం శ్రీమంతం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Venu Medipelly, News18, mulugu

ఆదివాసీ మహిళలకు శ్రీమంతం చేసిన అంగన్వాడి అధికారులు

సర్వ సాధారణంగా గర్భం దాల్చిన మహిళలకు ఆరు నెలలు నిండిన అనంతరం శ్రీమంతం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టు వారు ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. కానీ ఆదివాసి మహిళలు మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు వారి నివాసాలలో జరిగే ప్రసక్తి కల్పించదు. కానీ గర్భం దాల్చిన ఆదివాసీ మహిళలకు అంగన్వాడి అధికారులు భరోసా కల్పిస్తున్నారు.

సాంప్రదాయం, అలవాట్లు ఏ విధంగా ఉండాలో వారికి తెలియజేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లవ్వల ప్రాంతంలోని ఆదివాసి గిరిజన మహిళలు గర్భం దాల్చిన అనంతరం ఎలాంటి పౌష్టిక ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై వారికి నిరంతరం అంగన్వాడీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన కల్పించడమే కాకుండా శ్రీమంతం నిర్వహించి వారికి అండగా నిలబడుతున్నారు. తాడ్వాయి అంగన్వాడి సూపర్వైజర్ విజయ అంగన్వాడి టీచర్ మంజుల ఆదివాసి మహిళలకు శ్రీమంతం నిర్వహించి వారికి అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూస్ 18 అంగన్వాడి సూపర్వైజర్ తో మాట్లాడే ప్రయత్నం చేసింది... బయట ప్రపంచం రోజురోజుకీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆదివాసి ప్రజలు మాత్రం ఇంకా అటవీ ప్రాంతాలలోనే తమ జీవనాలను కొనసాగిస్తున్నారు. వారికి ఆరోగ్యం విషయంలో, పౌష్టిక ఆహారం విషయంలో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో అంగన్వాడి సెంటర్ల ద్వారా వారికి పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది. ఆదివాసి మహిళలు నెలలు నిండిన అనంతరం వారి అటవీ ప్రాంతంలోని డెలివరీ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆ పద్ధతిని మార్చుకోవాలి వైద్య నిపుణుల ఆధ్వర్యంలోనే డెలివరీలు చేయించుకోవాలి. వాటికి సంబంధించిన అంశాలను స్థానికంగా ఉండే అంగన్వాడీ టీచర్ చూసుకుంటుంది.

కానీ ఆదివాసి మహిళలు మాత్రం వారి సమస్యలను వారి బాధలను పూర్తిగా చెప్పుకోవడం లేదు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు మనతో మమేకమై వారి సమస్యలను మనకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగానే ఆదివాసి మహిళలకు శ్రీమంతం చేస్తూ వారి సమస్యలను మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వారికి అంగన్వాడి సెంటర్ల ద్వారా పౌష్టిక ఆహారం అందజేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం అని అంగన్వాడి సూపర్వైజర్ చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతర అంగన్వాడి అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అంగన్వాడి అధికారులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందించాల్సిన అవసరం ఉంది.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు