రిపోర్టర్ : వేణు మేడిపెళ్లి
లొకేషన్ : ఐలాపూర్
మేడారం సమ్మక్క మన దేవతకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అనేకమంది అనేక విధాలుగా సమ్మక్క చరిత్రను చెప్పుకుంటారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలపై అనేక జానపద గేయాలు సినీ గేయాలు వచ్చాయి. కానీ సమ్మక్క వనదేవత చరిత్రకు సంబంధించి సజీవ ఆనవాళ్లు నేటికీ అలానే ఉన్నాయి. మరి ఆనవాలు ఎక్కడ ఉన్నాయి..? సమ్మక్క తల్లి ఎక్కడ జన్మించింది....? జన్మించిన ప్రాంతాన్ని వదిలి సమ్మక్క దేవత ఎక్కడికి వలస వెళ్లింది...?ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఐలాపూర్ ఘట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లాల్సిందే.
కన్నైగూడెం మండల కేంద్రంలోని ఐలాపూర్ గ్రామం చిన్న గ్రామం. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ దట్టమైన ఈ కారణ్యంలోనే సమ్మక్క తల్లి దేవత ఆనవాళ్లు నేటికీ సజీవంగానే ఉన్నాయి. మేడారం మహా జాతర అయితే ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఐలాపూర్ అటవీ ప్రాంతంలో సమ్మక్క తల్లి దేవత జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా ఇక్కడున్న గిరిజనులు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతంలోనే సమ్మక్క తల్లి ఆడుకోవడం, పులితో సంచరించడం లాంటి చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయని ఇక్కడికి గిరిజనుల నమ్మకం.
మేడారం మినీ జాతర సమయంలోనే ఐలాపూర్ జాతర మొదలవుతుంది. ఈ జాతరకు మూడు నుంచి నాలుగు లక్షల మంది హాజరవుతారని ఐలాపూర్ దేవాలయం ప్రధాన పూజారులు చెప్తున్నారు.
ఐలాపూర్ జాతరలో ప్రధాన ఘట్టాలు...
ఫిబ్రవరి ఒకటో తారీకు బుధవారం రోజున సర్వాయి గ్రామం నుండి సరళమ్మ దేవతను పూజారులు గద్దె పైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి రెండో తారీఖు గురువారం రోజున సమ్మక్క దేవతను గద్దె పైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి మూడో తారీకు శుక్రవారం రోజున సమ్మక్క సారమ్మ దేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 4వ తారీఖు శనివారం రోజున సమ్మక్క సారలమ్మ దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు.
ఎంతో చరిత్ర కలిగిన ఐలాపూర్ జాతరకు మల్లెల వంశస్థులు ఐదవ గొట్టు వారు పూజారులుగా వ్యవహరిస్తారు. కురుసం వంశస్థులు మూడవ గొట్టు వారు వడ్డెలుగా ఉంటారు. ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర గిరిజనులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ నుంచి అందే సహాయం అరా కోరగానే ఉండేది. కానీ ఇప్పుడు జరిగే జాతరకు ములుగు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్వహణకు సంబంధించ నిధులు కేటాయించడం భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇద్దరు అధికారుల ప్రత్యేకత ఐలాపూర్ లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana