M.Venu, News 18, Mulugu
Mulugu;రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీ రామ ఉయ్యాలో..... రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో... రామ రామ రామ ఉయ్యాలో రాగ మెత్త రాదే ఉయ్యాలో ....నెత్తి మీద సూర్యుడు ఉయ్యాలో నేల వండేదాకా ఉయ్యాలో అంటూ తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా జానపదాలు వినిపిస్తాయి. వారందరూ గేయ రచయితలు కాదు. పెన్ను పెట్టి పాటలు రాయడం అస్సలు రాదు. వారికి వచ్చిందల్లా నోటికి వచ్చిన పదాలను జతకట్టి జానపదాలుగా మార్చడం మాత్రమే. నేటి ఆధునిక కాలంలో సినీ గేయాలు అందరిని ఉర్రూతలు ఊగిస్తున్నాయి... సినీ గేయాలలో అనేక పాటలు వినోదం కోసం, సామాజిక చైతన్యం కోసం, యువతలో స్ఫూర్తి నింపడానికి, సమాజాన్ని ఆలోచింప చేయడానికి కీలకపాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు.
దశాబ్దాలు, రోజులు గడుస్తున్నప్పుడు పాటలు కొత్త రూపం దాలుస్తున్నాయి. ఇప్పుడు ఉర్రూతలూగించే సినీ గేయాలకు బీజం పడింది మాత్రం ఎక్కడో తెలుసా.. మన పల్లెటూర్లలోనే. అవును జానపద గేయాలు పల్లెటూర్లలోనే పురుడు పోసుకున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు…కొందరు తెలిసినా మర్చిపోయారు.
నేటి కాలంలో జానపద గేయాలు అంటే సమాజంలో ఒక మార్పు కోసం, ఒక మంచి కోసం, ఒక ఆలోచన విధానాన్ని మార్చడం కోసం పునాదులుగా వాడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే జానపద గేయాలకు విప్లవ పాటలకు ఆకర్షితులై అనేకమంది ఉద్యమ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన వారు ఎందరో. తెలంగాణ ఉద్యమ సాధనలో కూడా జానపద గేయాలు కీలకపాత్ర పోషించాయి.
Read this also ; Mulugu: ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం మాట నిలబెట్టుకుంటుందా..?
అలాంటి జానపద గేయాలు వ్యవసాయ కూలీలు వారి శ్రమను అలసటను మరిచిపోయే విధంగా ఏ విధంగా పాటలు పాడుతారు చూపించే ప్రయత్నం న్యూస్18 చేసింది. న్యూస్ 18 ప్రతినిధి వ్యవసాయ కూలీలతో మాట్లాడి..వారి జీవితంలో జానపద గేయాల ప్రాధాన్యం ఎంత అని తెలుసుకున్నారు.
పొద్దు పొడిచిన సమయం నుంచి పొద్దు ఊకే సమయం వరకు వ్యవసాయ కూలీలు ఈ జానపద పాటల ద్వారానే పనులు చేస్తూ ఉండటం విశేషం. తెలతెల్లవారంగా లేలేత సూర్య కిరణాలు వాకిళ్లను ముద్దాడంగా వ్యవసాయ కూలీల రోజు మొదలవుతుంది.. ఇంటి పనులు ముగించుకొని… ఉడుకుడుకు బువ్వ మాగిన మామిడికాయ పచ్చడితో సద్ది మూట పెట్టుకొని పొలంలోకి వెళ్తారు. 100 మీటర్లు నడిస్తేనే ఆయాసపడే ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుము వంచి వరి నాట్లేస్తూ…పాటలు పాడుతూ వారి పని అలసట కష్టం మర్చిపోతుంటారు.
Read this also ; Rajannasiricilla: రాజన్న అనుబంధ ఆలయంలో అపచారం.. మరీ అంత నిర్లక్ష్యమా..? ఇంతకీ ఏం జరిగిందంటే..!
తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర వైపు అస్తమించే సమయానికి వాళ్లు ఇంటికి చేరుతారు. ఇలా రోజువారి జీవనం ఎనిమిది గంటలకు పైగానే వ్యవసాయ కూలీలు పొలాల్లోనే గడుపుతారు. ఆ నేలతల్లితో అనుబంధాన్ని పెంచుకుంటారు అందుకే ఇప్పటికీ సగటు మానవుడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తాడు. లక్షల కోట్లు సంపాదించకపోయినప్పటికీ వ్యవసాయం అంటే వారికి ప్రాణం. వాటిపై ఆధారపడి అనేకమంది వ్యవసాయ కూలీలు జీవనం కొనసాగిస్తుంటారు.
Read this also; Rajanna Sircilla: పనిమంతులంటే వీళ్లే.. మహా నాటుగాళ్లు; వరినాట్లు వేసేందుకు వచ్చిన బీహార్ కూలీలు
తెలంగాణలో ఇంతటి క్రేజ్ ఉన్న జానపదాలకు పుట్టినిల్లు ఆ పొలాలే.. అందులో పనిచేసుకునే మహిళల కష్టం నుంచి పుట్టుకొచ్చినవే జానపదాలు అని చెబుతుంటారు. ఏదేమైనా ఇప్పుడు ప్రతిచోట జానపద పాటలే వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లోనూ జానపద పాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు జానపద గేయాలు పాడే వాళ్లు ఫేమస్ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం జానపదుల హవా నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Local News, Mulugu, Telangana