హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu: ములుగులో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలుసా?

Mulugu: ములుగులో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలుసా?

X
మెగాజాబ్

మెగాజాబ్ మేళా

Telangana: ములుగు జిల్లాలో గిరిజన యువత ఎక్కువగా ఉంటుంది. అయితే.. వీరిలో అనేకమంది గిరిజన యువత మంచి మంచి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : వేణు

లొకేషన్ : ములుగు

ములుగు జిల్లాలో గిరిజన యువత ఎక్కువగా ఉంటుంది. అయితే.. వీరిలో అనేకమంది గిరిజన యువత మంచి మంచి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటూ ఉంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన యువతి, యువకుల కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. తెలుగులో జరిగిన జాబ్ మేళాకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గిరిజన యువతి యువకులు వందల సంఖ్యలో తరలివచ్చారు. ఈ జాబ్ మేళాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 700 మందికి పైగా యువతి యువకులు పాల్గొని అధికారులను ఆశ్చర్యానికి గురి చేశారు.

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కావాలంటే మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. కానీ సొంత జిల్లాలోని ఇలా జాబ్ మేళాలో నిర్వహించి మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం, ఇంటర్వ్యూలు నిర్వహించడం, అర్హత ఉన్నవారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి 15 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల నెల జీతం వరకు అందించే కంపెనీలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని జాబ్ మేళాకు హాజరైన యువతి యువకులు చెప్తున్నారు.

జిల్లా కలెక్టర్కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి అంకిత్ ఆదేశానుసారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ జాకారం, ములుగు నందు గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ కంపెనీలు, వివిధ ఉపాధి రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.

కాగా, ఈ జాబ్ మేళాకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 784 మంది గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కాగా 399 మంది వివిధ కంపెనీలలో ఎంపిక అయ్యారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు వివిధ కంపెనీల నుండి రాబోవు రెండు రోజులలో అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పించడం జరుగుతుందని చెప్పారు.

ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15000 వేల నుండి 35 వేలవరకు జీతాలు ఉండగా.. వారి అర్హతను బట్టి సంబంధిత కంపెనీ వారు నిర్ణయించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ యొక్క జాబ్ మేళాకు హాజరైన గిరిజన యువతీ యువకులకు భోజన వసతి, మంచినీటి వసతి కల్పించారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ఐటీడీఏ ఏటూరునాగారంఏపీఓ జే వసంతరావుకిఅప్పగించగా.. ములుగు, జే ఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల డీఆర్డిఓల సహకారంతో విజయవంతమైనట్లు చెప్పారు.

First published:

Tags: JOBS, Mulugu, Telangana

ఉత్తమ కథలు